ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొత్తా ప్రభాకర్ రెడ్డి

ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొత్తా ప్రభాకర్ రెడ్డి

0
TMedia (Telugu News) :

ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొత్తా ప్రభాకర్ రెడ్డి

టీ మీడియా, డిసెంబర్ 13, హైదరాబాద్‌ : దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కొత్తా ప్రభాకర్ రెడ్డి బుధవారం మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు నేతృత్వంలో బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలసి రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామాకు గల కారణాలను స్పీకర్‌కు వివరించారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు శాలువా, పుష్పగుచ్ఛంతో స్పీకర్‌ను మర్యాదపూర్వకంగా సత్కరించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.

Also Read : డిప్యూటీ సీఎం భ‌ట్టి అధికారిక నివాసంగా ప్ర‌జా భ‌వ‌న్

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube