ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అవార్డు అందుకున్న యూత్ ఐకాన్ కొత్తూరి మహేష్

0
TMedia (Telugu News) :

టీ మీడియా; నవంబర్ 17; కొడిమ్యాల
ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా సమయంలో సమాజానికి సేవలు చేస్తున్న వారిని గుర్తించి కరోనా వారియర్ అవార్డు లను ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందిన సామజిక వేత్త, రక్తదాన అనుసంధాన కర్త కొత్తూరి మహేష్ చేసిన సేవలను ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు గుర్తించి ఈ అవార్డు ను ఇవ్వడం జరిగింది.

కొత్తూరి మహేష్ చేసిన సేవలను గుర్తించి ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఇచ్చిన కరోనా వారియర్ అవార్డు అందుకోవడం గర్వించదగ్గ విషయం అని సామజిక సేవలో ముందుండి ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని రక్తదాత అనుసంధాన కర్త గా ఉంటూ యువతలో ఉన్నా రక్తదానం పై ఉన్నా అపోహలను తొలగించి ఎందరో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా వారికి రక్తదానం చేపించడం చాలా గొప్ప విషయం అని ఈలాంటి సామాజిక సేవలు మరిన్ని చేయాలని ఇంకా ఇలాంటి అవార్డు మరెన్నో పొందాలని యూత్ సభ్యులు అన్నారు. కరోనా వారియర్ అవార్డు గ్రహీత కొత్తూరి మహేష్ మాట్లాడుతూ ఒమాన్ తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు, మీడియా కన్వీనర్ వంకాయల కార్తీక్ సభ్యులు వేమన్ కుమార్ శ్యాం మామిడి, అల్లే గంగాధర్, గరిగే రమేష్ గార్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

*Kothuri Mahesh Receives Oman Telangana Friends Award*
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube