రాజమండ్రిలో కోటి గోటి తలంబ్రాలు సిద్ధం

-అభిషేకానంతరం భద్రాచలం పయనం

0
TMedia (Telugu News) :

రాజమండ్రిలో కోటి గోటి తలంబ్రాలు సిద్ధం

-అభిషేకానంతరం భద్రాచలం పయనం

లహరి, పిబ్రవరి23,తూర్పుగోదావరి :జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ లో శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో భక్తులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలకు 108 కడవలతో గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు.ఐదు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పండించిన వరితో తయారుచేసిన తలంబ్రాలను శ్రీకృష్ణ చైతన్య సంఘం అయోధ్య శ్రీరామచంద్రుడికి సమర్పించనుంది. కోటి గోటి తలంబ్రాలను మూడు వేల మంది భక్తులు ఒలిచి సిద్ధం చేస్తారు. ఈ తలంబ్రాలను అభిషేకం అనంతరం గత 12 ఏళ్లుగా భద్రాచలం శ్రీరామచంద్రులకు సమర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కర ఘాట్ లో శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో భక్తులు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలకు 108 కడవలతో గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా గత 12 సంవత్సరాలుగా భద్రాచలం శ్రీ రామచంద్రులకు ఐదు రాష్ట్రాల్లో మూడువేల మంది కోటి తలంబ్రాలతో ఒలిపించి కోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించడం జరుగుతుంది.

Also Read : కాళికాదేవి పరమ భక్తుడు రామకృష్ణ పరమహంస

ఈసారి అయోధ్యలో కూడా ఏర్పాటు చేయాలని భావనతో దేశమంతా రామ తత్వాన్ని తీసుకురావాలని, రామరాజ్యం కావాలని కోటి తలంబ్రాలను అయోధ్యకు తీసుకెళ్లాలని, ఈనెల 22న అయోధ్యకు బయలుదేరడం జరుగుతుందని చెప్పారు. 26న సరయు నది తీరంలో 108 మంది కలశాలతో అభిషేకం చేసి అయోధ్యకు తలంబ్రాలు సమర్పించడం జరుగుతుందని శ్రీకృష్ణ చైతన్య సంఘం కళ్యాణం అప్పారావు చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube