–భట్టుపల్లి,కొత్తగూడెం గ్రామల్లో ఇంటింటికి కేసీఆర్ గ్రామ గ్రామానికి టీఆర్ఎస్ విస్తృత పర్యటన
-గ్రామంలో రేగాకు ప్రజల బ్రహ్మ రధం
-పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు
-పలు కుటుంబాలను పరామర్శించిన రేగా
టీ మీడియా,డిసెంబర్ 16,కరకగూడెం;
ఏజెన్సీలో విద్యార్థుల భవిష్యత్తు కోసం విద్యాభివృద్దికి నిరంతరం కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
కరకగూడెం మండలంలో భట్టుపల్లి వీరాపురం క్రాస్ వద్ద 3కోట్ల 33లక్షల వ్యయంతో కస్తూరిబా నూతన విద్యాలయాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రారంభించారు.
అనంతరం భట్టుపల్లి,కొత్తగూడెం గ్రామల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇంటింటికి కేసీఆర్ గ్రామ గ్రామానికి టీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు రేగాకు పూలదండలు వేసి బ్రహ్మ రధం పెట్టారు.
ఈ సందర్భంగా ప్రజల సమస్యలపై ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి,ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడారు.
ప్రజలను ఇబ్బందులకు గురి చేసై సహించేదే లేదంన్నారు.పలు గ్రామల్లో పలు చోట్ల సీసీ రోడ్డులను శంకుస్థాపన చేశారు.
సమత్ మోతె సర్పంచు ఇర్ప విజయ్ కుమార్ తండ్ర సత్యం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రేగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించి,యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.

కొత్తగూడెం గ్రామలో పలు కుటుంబాలను రేగా పరామర్శించారు.స్థానిక సర్పంచు గొగ్గల నాగమణి ప్రసవం అవగా వారి పిల్లలను లాలించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రావులసోమయ్య, ఎంపీపీ రేగా కాళిక,పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం రాము,యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ ,ఆత్మ డైరెక్టర్ కొంపెల్లి పెద్ద రామలింగం,సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య ,ముఖ్య నాయకులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, కోలేటి భవానీ శంకర్,వట్టం రాంబాబు,అన్ని గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు,ఉప సర్పంచ్లు,వార్డు సభ్యులు,కార్యకర్తలు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
