కౌశిక్ రెడ్డి సవాల్‌కు తోక ముడిచిన ఈటల రాజేందర్
కౌశిక్ రెడ్డి సవాల్‌కు తోక ముడిచిన ఈటల రాజేందర్
కౌశిక్ రెడ్డి సవాల్‌కు తోక ముడిచిన ఈటల రాజేందర్
టీ మీడియా,ఆగస్టు5, కరీంనగర్ : హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై చర్చకు రావాలని ఈటల రాజేందర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన విషయం విదితమే. కౌశిక్ రెడ్డి సవాల్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తోక ముడిచారు. ఈటల బహిరంగ చర్చకు రాకుండా.. వెనుకడుగు వేశారు.ఈటల రాజేందర్‌కు సవాల్ విసిరిన మేరకు టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం ఉదయం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాడి కౌశిక్ రెడ్డి ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు.హుజురాబాద్‌లో కాకుండా గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఈటల రాజేందర్ ప్రకటించుకుంటాడు. ఎవడు పడితే వాడు అక్కడ ఇక్కడ పోటీ చేస్తామని చెప్పడానికి వీల్లేదని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తాడు. మీ నాయకుడే నీ మాటలను పరిగణించడం లేదు.. నీ మాటలను జోకర్ మాటల్లా చూస్తున్నారు.
Also Read : రేషన్ డాన్ చేతిలో బలైన యువకుడు
అందుకే నిన్ను జోకర్ అన్నామని స్పష్టం చేశారు.హుజురాబాద్ ప్రజలు నిన్ను గెలిపించింది సేవ చేయడానికి.. నువ్వు మాత్రం ప్రజల్లో లేవు. ఉప ఎన్నికల్లో గెలిచి 9 నెలలు గడుస్తున్నప్పటికీ.. ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. నీ కంటే ఒక ఇంచు ఎక్కువ తెలివి ఉన్న కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్నాడన్న విషయాన్ని మరిచిపోవద్దు.. గుర్తు పెట్టుకో. నేను అడిగింది కేవలం హుజురాబాద్ అభివృద్ధి గురించి మాత్రమే. ఎందుకు అంత ఫ్రస్టేషన్‌కు గురవుతున్నావు. నీ స్థాయి హుజురాబాద్ దాటిపోయే స్థాయి కాది. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్ గడ్డ టీఆర్ఎస్ పార్టీ అడ్డా అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube