టీ మీడియా నెక్కొండ అక్టోబర్27: వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అలంఖానిపేట గ్రామంలోని ఇప్పటివరకు కోవిడ్ 19 వ్యాక్సిన్ టీకా మొదటి డోస్,కానీ రెండవ డోస్ తప్పనిసరిగా వేయించుకోవాలి కరోనా వైరస్ మన నుండి పోలేదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.మాస్క్, సనీటైజర్,భౌతిక దూరం పాటించాలి. కోవిడ్ 19 వ్యాక్సిన్ టీకా వేసుకొనివారుంటే తప్పక వేయించుకోవాలి.నేను నేడు నాతో పాటు పది మందికి దగ్గర ఉండి వ్యాక్సిన్ వేయించాను మీరు కూడా వేయించుకోండి మీ తోటివారికి కూడా వ్యాక్సిన్ వేయించండి.అలాగే అలంఖానిపేట గ్రామంలో యువత ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాలి అలాగే ప్రజలకు కోవిడ్ పై చేతన్యం కల్పించాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నీలం ఎలెందర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.