కృష్ణా జలాల వివాదం.. కీలక సమావేశం వాయిదా

కృష్ణా జలాల వివాదం.. కీలక సమావేశం వాయిదా

0
TMedia (Telugu News) :

కృష్ణా జలాల వివాదం.. కీలక సమావేశం వాయిదా

టీ మీడియా, డిసెంబర్ 5, అమరావతి : కృష్ణా జలాల వివాదంపై నేడు నిర్వహించనున్న కీలక సమావేశాన్ని కేంద్ర జల్‌శక్తి వాయిదా వేసింది. మిచౌంగ్‌ తీవ్ర తుపాను కారణంగానే ఈ భేటీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో ఈ సమావేశం ఉంటుందని తొలుత ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాలను మిచౌంగ్‌ తుపాను కుదిపేస్తుండడంతో అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో తలమునకలైంది. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహించడం సబబు కాదని భావించిన కేంద్ర జల్‌శక్తి వాయిదా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీన సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

Also Read : బీజేపీ అగ్ర నేతలు అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించారు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube