బుగ్గపాడు ఫుడ్ పార్క్ పూర్తికి కేటీఆర్ హామి
-మాజీ మంత్రి తుమ్మల వినతికి కేటీఆర్ సానుకూల స్పందన
టీ మీడియా,ఫిబ్రవరి 16 , హైద్రాబాద్ : ఖమ్మం జిల్లా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేసి, పార్క్ ను స్థానికులకు అందుబాటులోకి తీసుకు రావాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ను కోరారు. తుమ్మల గురువారం హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసి, బుగ్గపాడు ఫుడ్ పార్క్ పనుల పురోగతి గురించి వివరించారు. పెండింగ్ పనులను వేగవంతం చేయాలని తుమ్మల ఈ సందర్భంగా కేటీఆర్ ను కోరారు. ఉద్యాన పంటల రైతులకు మౌళిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో సత్తుపల్లి మండలం బుగ్గపాడులో 200 ఎకరాల్లో ఫుడ్ పార్క్ నిర్మించేందుకు నవంబర్ 13, 2016లో కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కానీ ఆ తర్వాత పనులు మందకొడిగా కొనసాగుతున్నాయి. సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతం ఉద్యాన పంటలకు పెట్టింది పేరు. ఉద్యాన పంటలైన పామాయిల్, మామిడి, జామ, కొబ్బడి, కోకో, వక్క, మొక్కజొన్న తదితర పంటలకు ప్రసిద్ధి.అందువల్ల బుగ్గపాడులో తుమ్మల విజ్ఞప్తి మేరకు ఆనాడు ఫుడ్ పార్క్ ఏర్పాటుకు కేటీఆర్ శంకుస్ధాపన చేయడం జరిగింది.
Also Read : సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు
ఫుడ్ పార్క్ వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేటీఆర్ కు తుమ్మల వివరించారు. స్థానికుల ప్రయోజనం కోసం ఉద్యాన పంటలకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని తుమ్మల కోరగా, కేటీఆర్ సానుకూలంగా స్పందించి, పండ్ల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని, ఫుడ్ పార్క్ పనులను వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కేటీఆర్ , తమ్మలకు హామి ఇచ్చారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube