ప్రజలకు దొంగ ఎవరో.. దొర ఎవరో అర్థమైంది : మంత్రి కేటీఆర్‌

ప్రజలకు దొంగ ఎవరో.. దొర ఎవరో అర్థమైంది : మంత్రి కేటీఆర్‌

1
TMedia (Telugu News) :

ప్రజలకు దొంగ ఎవరో.. దొర ఎవరో అర్థమైంది : మంత్రి కేటీఆర్‌

టీ మీడియా, అక్టోబర్ 29, హైదరాబాద్‌ : ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు.‘‘ప్రజలకు దొంగ ఎవరో.. దొర ఎవరో అర్థమైంది. దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ మనది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయి.ఇప్పుడు మేం ఏం మాట్లాడినా వక్రీకరిస్తారు. పరిశోధన చేస్తున్న సంస్థలు సమాచారం ఇస్తాయి. మేం బాధ్యత గల వ్యక్తులం. చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తుంది. సందర్భానుసారంగా సీఎం, దర్యాప్తు సంస్థలు వివరాలు వెల్లడిస్తాయి. దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసేలా మాట్లాడము.

Also Read : ఉచిత శిక్షణకు స్పాట్ అడ్మిషన్స్

తొందర పడవద్దని మా పార్టీ నాయకత్వానికి చెప్పా. సమయానుసారం సీఎం అన్ని విషయాలు మాట్లాడతారు. ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే ఇంక పోలీసులు ఎందుకు’’ అని మంత్రి అన్నారు.ఈ సందర్భంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది సున్నా అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, మోడీ సర్కార్‌పై పలు ఛార్జ్‌ షీట్‌లు దాఖలు చేస్తున్నట్లు చెప్పారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube