తెలంగాణ భవన్‌లో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన కేటీఆర్‌

తెలంగాణ భవన్‌లో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన కేటీఆర్‌

0
TMedia (Telugu News) :

తెలంగాణ భవన్‌లో రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన కేటీఆర్‌

టీ మీడియా, నవంబర్ 29, హైదరాబాద్‌ : దీక్షా దివస్ సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో రక్త దాన శిబిరాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం స్వయంగా రక్త దానం చేశారు. కాగా, అంతకు ముందు బీఆర్‌ఎస్‌ భవన్‌కు చేరుకున్న కేటీఆర్‌కు తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ చేపట్టవద్దని ఎన్నికల స్క్వాడ్ అభ్యంతరం తెలిపింది. ప్రచారం గుడువు ముగిసినందున పార్టీ కార్యాలయాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని సూచించింది. అయితే దీక్షా దివస్ ఎన్నికల కార్యక్రమం కాదని బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహిస్తామని తెలుపడంతో అందుకు ఎన్నికల అధికారులు అంగీకరించారు. దీంతో పెద్ద ఎత్తున కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్‌ శ్రేణులు రక్తదానం చేశారు.

Also Read : చంద్ర‌బాబుపై ఓటుకు నోటు కేసు..విచార‌ణ వాయిదా

తెలంగాణ అజరామర చరిత్రకు వీరోచిత సంతకం దీక్షా దివస్‌ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. నవంబర్‌ 29, 2009 కేసీఆర్‌ ఆమరణ దీక్షకు దిగిన ఈరోజు.. మలిదశ ఉద్యమంలో లక్ష్యం దిశగా అడుగులేసేందుకు మార్గదర్శకమైందని.. ఆ స్ఫూర్తిని కొనసాగిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube