కోటి కుంకుమార్చన ప్రారంభం

కోటి కుంకుమార్చన ప్రారంభం

1
TMedia (Telugu News) :

కోటి కుంకుమార్చన ప్రారంభం

టి మీడియా, జూలై 29,యాదాద్రి: లక్ష్మీనరసింహ స్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రధానాలయ వెలుపలి ప్రాకార ఈశాన్య మండపంలో విష్వక్సేనారాధన, స్వస్తీవాచనంతో ఉత్సవాలను ప్రారంబించారు. ప్రధానాలయంలోకి లక్ష్మీ అమ్మవారు ప్రవేశించిన తర్వాత మొదటిసారిగా వస్తున్న శ్రావణమాసంలో జరిగే ఈ వేడుకను అత్యంత వైభవంగా చేపట్టనున్నారు.

 

Also Read : నిత్యా అన్నదాన పథకానికి విరాళం

భక్తులందరికీ చేరువ కావాలని, అభయం ఇవ్వాలన్న సంకల్పంతో లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో గీత, ప్రధానార్చకుడు నల్లన్‌థీఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తులకు వారి గోత్రనామాల పేరిట సంకల్పం చేస్తారు. మొదటి రోజు పాల్గొనే భక్తులకు శెల్లా, కనుము, కుంకుమ, లడ్డూ ప్రసాదం అందజేస్తామని ఈవో తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube