పెన్సిల్ పంచాయితీ పోలీస్ స్టేషన్ కు చేరింది

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 25, మంత్రాలయం:

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని పెద్దకడబూరుకు చెందిన ఇద్దరు చిన్నారుల మధ్య… పెన్సిల్ కోసం పేచీ మొదలైంది. రోజూ తన బ్యాగులోని పెన్సిల్ దొంగతనం చేస్తున్నాడంటూ… హనుమంతు అనే బుడ్డోడు తన స్నేహితుడు హనుమంతుతో తరచూ గొడవ పడుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా పెన్సిల్ తీసుకోవడం ఆపడం లేదంటూ… ఏకంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. ఇద్దరు హనుమంతులతోపాటు ఇరుగుపొరుగు మరో ఇద్దరు పిల్లలు కూడా వారి వెంట స్టేషన్ కు వెళ్లారు. పెన్సిల్ తీసుకుంటున్న స్నేహితుడిపై కేసు పెట్టాల్సిందేనని చిన్నారి హనుమంతు పట్టుబడ్డాడు. పోలీసులు సర్దిచెప్పినా వినలేదు. ‘పిట్టకొంచెం – కూత ఘనం’ అన్నట్లు… కేసు పెట్టాలని భీష్మించాడు. బాలుడి తీరుతో సరదాగా నవ్వుకున్న పోలీసులు…. సరే కేసు పెడతాంలే అంటూ నచ్చజెప్పారు. ఇద్దరూ బాగా చదువుకోమని అక్కడి నుంచి పంపించివేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube