జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన కుష్బూ
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన కుష్బూ
జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించిన కుష్బూ
టీ మీడియా, ఫిబ్రవరి 28, న్యూఢిల్లీ : ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు కుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనకు అందివచ్చిన ఈ అవకాశం అత్యంత గొప్పదన్నారు. మహిళపై జరిగే అరాచకాలకు వ్యతిరేకంగా తన గొంతుకను బలంగా వినిపిస్తానని చెప్పారు. తనపై విశ్వాసంతో తనకు ఇంత గొప్ప బాధ్యతలు అప్పగించిన జాతీయ మహిళా కమిషన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కుష్బూ సుందర్ పేర్కొన్నారు. కాగా, సోమవారం జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నామినేట్ అయిన కుష్బూ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.