కెవిపిఎస్ జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయండి

కెవిపిఎస్ జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయండి

1
TMedia (Telugu News) :

కెవిపిఎస్ జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయండి

టీ మీడియా, జూలై 16, వనపర్తి బ్యూరో : కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో ఈ రోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం వనపర్తి జిల్లా 2వ మహాసభలను జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షలు వెంకట్రాములు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం కెవిపిఎస్ ఆలుపేరగని పోరాటం చేస్తుందని అన్నారు.

Also Read : ప్రజా సేవ లో నేటి విజయ్ గాంధీ

దళితుల బంధు పథకం అర్హత గల ప్రతి కుటుంబానికి రాష్ట్రమంత ఒకే సారి అమలుకై పోరాటం కొనసాగిస్తున్నామని అన్నారు. ఈ మహాసభలలో దళితుల సమస్యల పరిష్కారానికి చేపట్టబోయే ఉద్యమ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు. దళితులు అభ్యుదయ మేధావులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube