కార్మిక(ఖమ్మం )కలెక్టర్

కార్మిక(ఖమ్మం )కలెక్టర్

0
TMedia (Telugu News) :

కార్మిక(ఖమ్మం )కలెక్టర్

– కార్యాలయం అవరణ నుండే కార్యాచరణ ప్రారంభం

– పరిసరాల పరిశుభ్రత పై దృష్టి

– అధికారి అయిన ఆ పని తప్పదు అని నిరూపణ

టి మీడియా ,మే5,ఖమ్మం: ఢిల్లీ కి రాజు అయిన తల్లికి బిడ్డే అక్కడ ఎంత బిజీ ఉన్న జన్మ నిచ్చినఅమ్మ, జీవం ఇచ్చిన నాన్నల ను చూసే బాధ్యత కూడా మందే ఆన్న నానుడి ఉంది. అదే కాదు ఎంతటి అధికారి అయిన కార్యాచరణ అనేది కార్యాలయం నుండి మొదలు పెట్టాలి అన్నది ఇటీవల పంట నష్టం ప్రాంతాల్లో నేరుగా క్షేత్ర స్థాయి కి వెళ్ళిన కర్షక (ఖమ్మం)కలెక్టర్ వి పి గౌతం సమీకృత కలక్టరేట్ లో శ్రమదానం ద్వారా.. స్వయంగా చెత్తను శుభ్రం చేశారు. ఆయనే పాల్గొనడం తో అందరూ ఆ టెండర్ నుండి జిల్లా అధికారి వరకు అందరూ..శ్రమదానం లో పాల్గొన్నారు.కలెక్టర్ చర్య ఆయన కర్షక నే కాదు కార్మిక(ఖమ్మం)కలెక్టర్ అని అందరూ చెప్పు కొంటున్నారు వివరాలు లోకి వెళితే..

   ALSO READ:బిజెపి ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యత

కార్యాలయం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. గురువారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్నిపురస్కరించుకుని ఖమ్మం ఐడిఓసిలోఅధికారులు, సిబ్బంది చేపట్టినకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, ఐడిఓసి ఆవరణలో స్వయంగా కలుపు మొక్కలు, పిచ్చి మొక్కల తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రతి గురువారం కార్యాలయ పనివేళలు ప్రారంభానికి ముందు ఐడిఓసి ఆవరణ, కార్యాలయాల లోపల క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. పని ప్రదేశాలు పరిశుభ్రంగా, పచ్చగా ఉంచడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడి, పనిపై ధ్యాస పెరుగుతుందని అన్నారు. ఎవరో వస్తారు, చేస్తారు అని చూడక, మనం పనిచేసే ప్రదేశాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మన ఇంటిని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మనం ఎక్కువ సమయం వుండే కార్యాలయాన్ని అలాగే పరిశుభ్రంగా ఉంచాలన్నారు.వచ్చే డెంగ్యూ సీజన్ కావున పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవన్నారు. ప్రభుత్వం నిధులు వెచ్చించి సౌకర్యాల కల్పన చేస్తుందని, అట్టి సౌకర్యాలు మనం సద్వినియోగం చేసుకుంటూ, వాటిని కాపాడుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ ఐడిఓసి లోని వివిధ కార్యాలయాలు పరిశీలించి, సూచనలు చేశారు. ప్రతి కార్యాలయం తప్పనిసరిగా ఈ-ఆఫీస్ ద్వారా ఫైళ్ల నిర్వహణ చేయాలన్నారు. ఈ-ఆఫీస్ తో ఫైళ్ల నిర్వహణ సులభతరమే కాక, సురక్షితంగా వుంటాయని ఆయన తెలిపారు.

ALSO READ :పీఠాలు,మఠాలు నిర్వహణ లోని – కల్యాణ మండపాలు కిరాయి రెట్లు ప్రదర్శించాలి,ప్రకటించాలి

 

పాత ఫైళ్లను నిబంధనల మేరకు ఖండనము చేయాలని, అవసరం లేని ఫైళ్లను వారం లోగా తొలగించాలని అన్నారు. పాత ఫైళ్ళతో డస్ట్ ఏర్పడి, ఆరోగ్య సమస్యలు వస్తాయని, అనవసరంగా భద్రపర్చడంతో నిల్వ సమస్యలు వస్తాయని అన్నారు.వారంలో తిరిగి తనిఖీకి వచ్చేలోపు రన్నింగ్ ఫైళ్లు, నిబంధనల మేరకు భద్రపర్చాల్సిన ఫైళ్లు మాత్రమే ఉండాలని కలెక్టర్ అన్నారు. కార్యాలయం లోపల మంచి వాతావరణం ఉండాలని, పరిశుభ్రతను పాటించాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఐడిఓసి లో నాటిన మొక్కల వద్ద నున్న కలుపు, పిచ్చి మొక్కలను అధికారులు, సిబ్బంది తో కలిసి కలెక్టర్ తొలగించారు. పాల్గొన్న వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఆయన తెలిపారుఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్. శిరీష, జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube