గిరిజన పంచాయతీల్లో పరిపాలనా భవనాలు
– 600 కోట్లతో గిరిజన సంక్షేమ భవనాలు
– ట్రైబల్ డెవలప్మెంటుకి 12 వేల కోట్ల బడ్జెట్
– అన్ని తండాలకు బిటి రోడ్లు, సదుపాయాలు
మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటన
టీ మీడియా, మే 9,భూపాలపల్లి : అన్ని గిరిజన గ్రామ పంచాయతీలకు పరిపాలనా భవనాలు నిర్మిస్తున్నట్లు జిల్లా ఇంచార్జ్ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారు. అదేవిధంగా గిరిజన గ్రామాలకు, తండాలకు కనెక్టివిటీ పెంచడంకోసం బిటి రోడ్ల నిర్మాణం చేపడతామన్నారు.
సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 100 పడకల ఏరియా ఆసుపత్రిని తెలంగాణ ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. అలాగే, కొత్తగా 200 పడకల జిల్లా ఆసుపత్రికి, 50 పడకల ఆయుష్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో… జిల్లా ఇంచార్జి అయిన స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Also Read : రాబోయే ఆరు నెలలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
మంత్రి సత్యవతి తన ప్రసంగంలో…ఒకప్పుడు గిరిజనులంటే కేవలం ఓట్ల యంత్రాలుగానే భావించేవారని, ఏ ముఖ్యమంత్రికి గిరిజన సంక్షేమంపై సోయి ఉండేది కాదని ఆవేదన చెందారు. తెలంగాణ సొంత రాష్ట్రం సాధించుకున్నాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు గిరిజనుల కన్నీళ్లు తుడుస్తున్నారని, వాళ్ల అభివృద్ధిని సంక్షేమాన్ని పట్టించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక గిరిజనుల కోసం 3,146 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయన్నారు మంత్రి సత్యవతి. ఈ రోజున ఆర్థిక మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా వైద్య ఆరోగ్య సదుపాయాలు, ఏరియా ఆసుపత్రి ప్రారంభం కావడం పట్ల మంత్రి సత్యవతి హర్షం వెలిబుచ్చారు. స్వయంగా తాను సర్పంచిగా ఉన్న రోజుల్లో 200 రూపాయల పించను కోసం అల్లాడిపోయిన సంఘటన గుర్తు చేస్తూ… ఇప్పుడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ 2,016 రూపాయల పించనుని సిఎం కెసిఆర్ అందజేస్తున్నారని వెల్లడించారు. “ప్రతి ఒక్క కుటుంబాన్నీ పెద్ద కొడుకుగా కెసిఆర్ ఆదుకుంటున్నారు” అని ప్రజల హర్షధ్వానాల మధ్య మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆడబిడ్డలకోసం ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను వివరించారు.
Also Read : మృతుల కుటుంబాలకు ప్రధాని రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ‘భూపాలపల్లి నియోజకవర్గాన్ని సువర్ణ భూపాలపల్లిగా తీర్చిదిద్దుతాం’ అని హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ పసునూరి దయాకర్, భూపాలపల్లి జిల్లా జడ్పీ అధ్యక్షురాలు జక్కు శ్రీహర్షిణి, వరంగల్ జిల్లా జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, రాష్ట్ర వికలాంగుల సంస్థ ఛైర్మన్ వాసుదేవరెడ్డి, వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా జడ్పీ ఛైర్మన్ సాంబారి సమ్మరావు, మున్సిపల్ చైరుపర్సన్ సెగ్గేం వెంకట రాణి, జిల్లా కలేక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజేష్ నాయక్, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube