అమ్మ పరీక్ష రాస్తుంటే పాపను ఆడించిన మహిళా కానిస్టేబుల్
అమ్మ పరీక్ష రాస్తుంటే పాపను ఆడించిన మహిళా కానిస్టేబుల్
అమ్మ పరీక్ష రాస్తుంటే పాపను ఆడించిన మహిళా కానిస్టేబుల్
టీమీడియా, జూన్ 13,మహబూబాబాద్: జిల్లాలో టెట్ పరీక్ష ప్రశాంతంగా కొనసాగుతోంది. పరీక్ష రాసేందుకు చంటిపిల్లల తల్లులు సైతం పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో చిన్న పిల్లల ఆలనాపాలనా చూసేందుకు కుటుంబసభ్యులు పరీక్ష కేంద్రాల వద్ద వేచి ఉన్నారు.ఇదిలా ఉంటే ఓ పరీక్ష కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్ ఓ పక్క విధులు నిర్వర్తిస్తూనే మరో పక్క తన మాతృత్వాన్ని చాటుకుంది.రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న టెట్ పరీక్ష మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది.
also Read : బె‘ధర’గొడుతున్న చికెన్.. వేసవి కాలం
జిల్లా వ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో 11,429 మంది అభ్యర్థులు ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్దకు చంటి పిల్లల తల్లులు తమ కుటుంబ సభ్యులతో చేరుకున్నారు. అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా కుటుంబ సభ్యులు చెట్లకు ఉయ్యాలలు కట్టి పిల్లలను ఆడిస్తుండగా ఓ మహిళా కానిస్టేబుల్ పసి పాపను ఎత్తుకొని ఆడిస్తూ పాలు తాగించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube