ఫేక్ పట్టాతో మహిళా హోంగార్డ్ దౌర్జన్యం
-ఆమెతో ప్రాణ హాని
-సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలి
-బాధితుడు రేగళ్ల శేషు ఆవేదన
టీ మీడియా,ఆగస్టు5, ఖమ్మం: ఒక మహిళ హోంగార్డ్ నకలి పట్టాను సృష్టించి, ఈ ప్లాట్ తనదేనంటూ నాపై దౌర్జన్యం చేస్తుందని, ఆమె వల్ల తనకు ప్రాణం ఉందని, అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించి, తనకు తగిన న్యాయం చేయాలని బాధితుడు రేగళ్ల శేషు విన్నవించారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను 2013 డిసెంబర్ 15వ తేదీన ఇంటి ప్లాటు కోసం ఖమ్మం అర్బన్ తాసిల్దార్ కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకోగా 2014 జూన్ మాసంలో వైఎస్ఆర్ కాలనీ లో తనకు ఇంటి స్థలంతో పాటు పట్టా ఇచ్చారని, వెంటనే తాను అక్కడ బేస్ మట్టం కట్టడం జరిగింది అని తెలిపారు. తన భార్య అనారోగ్యం కారణంతో తాను ఇంటి నిర్మాణం ఆఫ్ చేసి, గత సంవత్సరం జనవరిలో తిరిగి ఇంటి నిర్మాణం మొదలుపెట్టగా మహిళా హోంగార్డ్ నోముల సుజాత (హెచ్ జి 859) ఈ ప్లాటు తనదని, బెదిరించడంతోపాటు తన పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగిందని పేర్కొన్నారు. ఏ విధంగానైనా తన ప్లాట్‌ను స్వాధీనం చేసుకుంటా నని పోలీస్ స్టేషన్లో తనపై కేసు పెట్టడం జరిగిందని వివరించారు.
Also Read : శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్ల ఎత్తివేత
ఈ ప్లాటు తనదేనని నిరూపించేందుకు గాను మహిళ హోంగార్డ్ నా ప్లాటు పై ఆమె ఇంటి నెంబరు కేటాయించుకోవడం జరిగిందని, విచారణలో ఈ ఇంటి నెంబరు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ దని తేలిందన్నారు. ఫేక్ పట్టా తోపాటు ఫేక్ ఇంటి నంబర్ సంపాదించిన ఆమె తనపై భౌతిక దాడి కూడా జరిగిందని, తాసిల్దార్ కార్యాలయంలో దీనికి సంబంధించిన రికార్డులు లేకుండా పోయాయని, జిల్లా కలెక్టర్, ఖమ్మం సిపి లతో పాటు ఖమ్మం అర్బన్ తాసిల్దార్ ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించి తనకు రక్షణతో పాటు న్యాయం చేకూర్చాలని బాధితుడు రేగళ్ల శేషు విజ్ఞప్తి చేశాడు. ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జక్కుల లక్ష్మయ్య, రేగళ్ల సీతారాములు, నాయకులు తెనాలి వీరబాబు ,గో ట్టిపర్తి శ్రీనివాస్, జక్కుల వెంకటరమణ ,కణతాల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube