దేశం దాటి వెళ్లేందుకు లాలూకు అనుమ‌తి

దేశం దాటి వెళ్లేందుకు లాలూకు అనుమ‌తి

1
TMedia (Telugu News) :

దేశం దాటి వెళ్లేందుకు లాలూకు అనుమ‌తి

టీ మీడియా,సెప్టెంబర్ 28, న్యూఢిల్లీ : వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న‌ బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆర్జేడీ అధ్య‌క్షుడు లాలూ ప్రసాద్ యాద‌వ్.. దేశం దాటి వెళ్లేందుకు అనుమ‌తి ల‌భించింది. గ‌త కొంత కాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న.. మెరుగైన వైద్యం కోసం వ‌చ్చే నెల సింగ‌పూర్‌కు వెళ్ల‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే వైద్య చికిత్స కోసం అక్టోబ‌ర్ 10 నుంచి 25 వ‌ర‌కు సింగ‌పూర్‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని లాలూ యాద‌వ్ కోర్టును కోరారు.

Also Read : డాక్టర్ల నిర్లక్ష్యానికి బలైన సింగరేణి కార్మికుడు

లాలూ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సింగ‌పూర్ వెళ్లేందుకు అనుమ‌తించింది.  కుంభ‌కోణానికి సంబంధించి లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌పై సీబీఐ, ఈడీ కేసులు న‌మోదు చేశాయి. ఈ కేసుల్లో ప్ర‌స్తుతం ఆయ‌న బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు. బెయిల్ ష‌ర‌తుల ప్ర‌కారం ఆయ‌న కోర్టు అనుమ‌తి లేకుండా విదేశాల‌కు వెళ్ల‌రాదు. ఈ నేప‌థ్యంలోనే లాలూ సింగ‌పూర్ వెళ్లేందుకు కోర్టు అనుమ‌తి కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube