చిరు వ్యాపారులకి స్థలాన్ని కేటాయించాలి

చిరు వ్యాపారులకి స్థలాన్ని కేటాయించాలి

1
TMedia (Telugu News) :

చిరు వ్యాపారులకి స్థలాన్ని కేటాయించాలి

 

టీ మీడియా, నవంబర్ 2, వనపర్తి బ్యూరో : చిరు వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు గడ్డం వినోద్ ఆధ్వర్యంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ కి బుధవారం వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు గడ్డం వినోద్ మాట్లాడుతూ వనపర్తి లోని ఎన్నో సంవత్సరాలుగా పాలిటెక్నిక్ నుండి రాజీవ్ చౌక్, అంబేత్కర్ చౌక్, గాంధీ చౌక్ వరకు మ్యాదరి (బొంగులు) అరె కటిక (మటన్), మంగళి (హైర్ కటింగ్), చాయి బండ్లు, పానీ పూరి బండ్లు, కమ్మరి వాళ్ళు ,బైర్ కమ్మరి వాళ్ళు సిక్కులు, సెల్ఫోన్ వ్యాపారులు పండ్లు బండ్లు మొదలగు అన్ని కులాలు నిరుపేద కుటుంబానికి చెందిన వారంతా వారి పరిస్థితి బాగాలేక రోడ్ పక్కకి ఉన్న ఖాళీ స్థలంలో గుడిసెలు వేసుకొని వారి జీవనోపాధి చేసుకొనే వారు వారి వాళ్ళే వనపర్తి ప్రజలకి చాలా రకాలు అవసరాలు అందుబాటులో ఉండేవి.

 

Also Read : స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం

 

అలాంటిది రోడ్ విస్తరణలో భాగంగా ఒక్కసారిగా అందరూ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా బయట కిరాయిలు కట్టలేక ఒక పూటతిని మరోపూట పస్తు ఉంటున్నారు.కావున ప్రజల్ని దృష్ట్యా వారి జీవనోపాధి దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి స్థలాన్ని కేటాయించి వారిని ఆదుకోవాలని భారతీయ మజుర్ధు సంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు అభిలాష్ ,అరుణ్, అరవింద్, వెంకటేష్, అజర్ సింగ్ రాజు, చిరు వ్యాపారులకు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube