చికెన్ కొట్టు సత్తి చిరు కబ్జా..?

కోటి విలువ చేసే గుట్టకు ఎసరు

1
TMedia (Telugu News) :

చికెన్ కొట్టు సత్తి చిరు కబ్జా..?

-నగరం నడి బొడ్డు న అక్రమం

-కోటి విలువ చేసే గుట్టకు ఎసరు

-పెద్ద ప్రజాప్రతినిధి నివాసం సమీపంలో బడా అక్రమం

టి మీడియా,మే 8, నిఘావిభాగం:

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషితో ఖమ్మం నగరం నలువైపులా అభివృద్ధి కొనసాగుతోంది.కార్పొరేట్ సొగసులు వచ్చాయి.భూముల విలువలు ముక్యంగా నివాస స్థలాలు విలువ పెరిగాయి.దీనితో కొంతమంది కళ్ళు ప్రభుత్వ స్థలాలు,నిరూపయోగం గా ఉన్న గుట్టలు పై పడ్డాయి.ఒక చికెన్ కొట్టు నిర్వాహకుడు గా ఉన్న బడా రాజకీయ వేత్త కుటుంబీకుడు నగర ము నడి బొడ్డున ఉన్న కోటి రూపాయలు విలువ చేసే గుట్ట ను బహిరంగ కబ్జా కు సిద్ధ పడ్డాడు.అదికూడా బడా ప్రజాప్రతినిధి ఇంటి సమీపంలో కావడం,రెవిన్యూ,మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు ఉండడం అనుమానం కలిగిస్తోంది.

Also Read : ఆకట్టుకున్న బాలనాగమ్మ నాటకం

నగరం లోని పార్శి బంధం, వెంకటగిరి ప్రాంతం, మారుతి నగర్ బైపాస్, రమణ గుట్ట మామిళ్ల గూడెం తదితర ప్రాంతాల్లో గుట్టలు ఉన్నాయి.ప్రస్తుత ము పై ప్రాంతాల్లో ఆనవాళ్లు మిగిలాయి. నగరంలో భూకబ్జా దారులు గా పేరున్న వారు,వారి కుటుంబీకులు నేటికి తమ కబ్జాల దందా కొనసాగిస్తున్నరు. ఇప్పటికే మున్సిపల్ రికార్డుల్లో ఉన్నట్లు గా చూపుతున్న పార్కులు కూడా మాయం అయ్యాయి. సివిల్ విషయం కావడం తో పోలీస్ శాఖ జోక్యం చేసుకోలేని పరిస్థితి. అధి కబ్జా అని చర్యలకు పోలీస్ శాఖ కు పిర్యాదు చేయాల్సిన రెవిన్యూ, మున్సిపల్ శాఖ వారు కబ్జాదారుల కు కొమ్ము కాస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Also Read : ఎమ్మెల్సీ తో కలిసి సమస్యలపై కలెక్టర్ కు వినతి పత్రం

కబ్జా లు వృత్తి గా ఉన్న వారు అధికారం ఏ పార్టీ ఉంటే దానిలో చేరుతున్నారు.నగరం లోని వెంకటి గిరి గేటు ప్రాంతంలో ని చిర్రావూరి నగర్ లో భారీగా ప్రభుత్వ స్థలం ఉంది.అక్కడ కొంతమంది స్థలాల కు ప్రభుత్వ పట్టాలు ఇచ్చారు.ఆ స్థలాలు మధ్య లో సుమారు ఎకరం స్థలం లో భారీ గుట్ట ఉంది ఈ గుట్ట లో చాలా వరకు తవ్వి ప్లాట్ లు చేసి అక్రమార్కులు అమ్మరు తాజాగా మిగిలిన గుట్టను యంత్రాలు ఉపయోగించి ఒక చికెన్ కొట్టు యజమాని త్వవ్వేశాడు.సుమారు 200ల గజాలు కు పైగా అక్రమంగా త్వవ్వేశాడు.మరికొంత తవ్వే పనిలో ఉన్నాడు..అయిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడక పోవడం అనుమానం కలిగిస్తోంది. ఇప్పటికే అదే ప్రాంతం లో మున్సిపల్ రికార్డుల్లో ఉన్న పార్క్ స్థలం లో నిర్మాణం లు వెలిశాయి.ఇక నైన ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విలువైన ప్రభుత్వ స్థలాలు కాపాడాలి అనికొరుతున్నరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube