బంజారాహిల్స్‌లో విలువైన స్థలం కబ్జా..
-గుడిసెలుకూల్చివేసిన రెవెన్యూ సిబ్బంది
టి మీడియా, మార్చి 12 ,హైదరాబాద్ : స్థలం ఎక్కడైనా కానీ, ఎంత విలువైనదైనా కానీ కబ్జారాయుళ్లు అవేవీ పట్టించుకోవడం లేదు. గుడిసెలు వేసి, నిర్మాణాలతో వాటిని ఆక్రమించేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డునెంబరు-12 ఎన్బీటీనగర్లో ఎకరం పై చిలుకున్న స్థలంలో మల్టీపర్పస్ కమ్యూనిటీహాల్ నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2017లో స్వయంగా సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. కొండప్రాంతం కావడంతో నిధులు సరిపోవడం లేదని రెండుమార్లు కాంట్రాక్టర్లు పని మొదలు పెట్టలేదు. కొద్ది రోజులుగా ఈ స్థలంపై కన్నేసిన కొందరు మొదట ఓ గుడిసె వేయించారు. స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఖాళీ చేస్తామని చెప్పాడు. కానీ, వారం రోజుల్లో మరో పది గుడిసెలు వేశాడు. ఆ తర్వాత శంకుస్థాపన రాయి తొలగించి చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఈ వ్యవహారంపై గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందాయి.సిబ్బంది కూల్చివేతలకు ప్రయత్నించగా, గుడిసెల్లో ఉన్నవారు ఆత్మహత్య చేసుకుంటామని హైడ్రామా ఆడడంతో సిబ్బంది వెనక్కి వచ్చేశారు.
Also Read : రియల్టర్ల మర్డర్ స్కెచ్ లో మట్టారెడ్డిపై పోలీసుల ఫోకస్
తాజాగా ప్రభుత్వం జీవో 58,59 అందుబాటులోకి తీసుకురావడంతో ఈ స్థలం పాతది అని నిరూపించేందుకు ప్రహరీ చుట్టూ కొంత పెయింట్ వేశారు. వీరు క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే సమస్యగా మారే అవకాశాలు ఉండటంతో షేక్‌పేట తహసీల్దార్ బంజారాహిల్స్ పోలీసులను బందోబస్తు అడిగారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ శుక్రవారం కూల్చివేతలు నిర్వహించారు. ఆక్రమణదారులు అడ్డగించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. రెవెన్యూ సిబ్బంది కూల్చివేతలు పూర్తి చేసి ప్రభుత్వ సూచిక బోర్డును ఏర్పాటు చేచేశారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube