ఐలాండ్ మాఫియాతో కుమ్మక్కైన అధికారులు జి ఎస్ పి ఆరోపణ

0
TMedia (Telugu News) :

భద్రాచలం కేంద్రంగా ఉన్నటువంటి గిరిజన అభివృద్ధి స్థలం ఉన్నట్టా ? లేనట్టా ?

టి మీడియా, డిసెంబర్ 11, చర్ల :
చర్ల మండల పరిధిలోగల సుబ్బంపేట గ్రామంలో వాసం ముసలయ్య అధ్యక్షత శనివారం జి ఎస్ పి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. భద్రాచల కేంద్రంలో ఎల్ టి ఆర్ 1/70 చట్టమును ఐటీడీఏ అధికారులు రక్షించాల్సిన ప్రభుత్వ ఆస్తులను రక్షించుకుండా, ల్యాండ్ మాఫియాతో చేతులు కలిపారని ఆరోపించారు. ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో కమ్యూనిటీ హాల్ కొరకు ఐటీడీఏ పీవో శంకుస్థాపన చేసి, శిలా పథకాన్ని ఏర్పాటు చేశారన్నారు. ల్యాండ్ మాఫియా ఆ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణం రెవిన్యూ చేపడుతుందని, ఐటీడీఏ అధికారులకు ఎన్నిసార్లు మెమోరాండం, ధర్నాలు చేసినప్పటికీ సంబంధిత అధికారులకు చలనం లేదని విమర్శించారు.

భద్రాచలం కేంద్రంగా ఉన్నటువంటి గిరిజన అభివృద్ధి స్థలం ఉన్నట్టా ? లేనట్టా ? అని ఆదివాసీలు ప్రశ్నిస్తున్నారు. దీనిలో భాగంగా సోమవారం ఐటిడిఏ జి ఎస్ పి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమం జయప్రదం చేయాలని ఆదివాసీలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి కల్లూరి కిషోర్, కుర్సం రాంబాబు, కాక ఎల్లేశ్వరరావు, కాక సాంబేశ్వరరావు, కణితి శ్రీనివాసరావు, వాసం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

The CPI branch Mahasabha was held at Rajupeta in the town on Saturday under the chairmanship of Singh Koteshwara Rao.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube