భూమి కొలతలు

భూమి కొలతలు ,

0
TMedia (Telugu News) :

భూమి కొలతలు ,రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు
1) ఒక ఎకరాకు = 40 గుంటలు
2) ఒక ఎకరాకు = 4840 Syd
3) ఒక ఎకరాకు = 43,560 Sft
4) ఒక గుంటకు = 121 Syd
5) ఒక గుంటకు = 1089 Sft
6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09
చదరపు ఫీట్లు
7) 121 x 09 = 1089 Sft
8) 4840 Syd x 09 = 43,560 Sft
9) ఒక సెంట్ కు = 48.4 Syd
10) ఒక సెంట్ కు = 435.6 Sft ఎకరానికి 1⁄100 (40.5 మీ 2; 435.6 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఒక శాతం నిర్వచించబడింది. ఇది ఇప్పటికీ చాలా వార్తా నివేదికలు మరియు రియల్ ఎస్టేట్ ఒప్పందాలలో ఉపయోగించబడుతుంది.
(ఒక ఎకరానికి 4046.8564224 చదరపు మీటర్లు (4046.82 చ.మీ కొందరు) ఒక ఎకరానిక్ 43, 560 చదరపు అడుగులు ఒక ఎకరానికి 0.405 హెక్టార్లు.ఒక ఎకరానికి 4840 చదరపు గజాలు (4800 చ.గ. కొందరు)ఒక ఎకరానికి 605 అంకణములు.ఒక ఎకరానికి 100 సెంట్లు. సెంటుకి 48.4 గజములు. అంటే 4840 గజములు ఒక ఎకరం. 40 గుంటలు ఒక ఎకరం (4840 గజములు) . 121 గజములు ఒక గుంట. 66 చదరపు అడుగులు × 660 చదరపు అడుగులు = ఒక ఎకరం సుమారుగా 208.71 చదరపు అడుగులు × 208.71 చదరపు అడుగులు = ఒక ఎకరం. 2.47 ఎకరాలు ఒక హెక్టారు. ఒక హెక్టారుకు 2 ఎకరాల 47 సెంట్లు)

భూమి కొలతలు ,కోసం

advt
adv

అడంగల్‌ (పహాణీ)

mp nama subhakakshalu
mp nama subhakakshalu

గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తంలో అడంగల్‌ అనీ, తెలంగాణలో పహాణీ అని పిలుస్తారు. భూమికి సంబంధించి చరిత్ర మొత్తం ఇందులో ఉంటుంది. భూముల కొనుగోలు, అమ్మకాలు, సాగు చేస్తున్న పంట వివరాలు ఎప్పటికపుడు ఇందులో నమోదు చేస్తారు.

తరి : నీటి పరిదాల భూమి

ఖుష్కీ : మెట్ట ప్రాంతం

గెట్టు : పొలం హద్దు

కౌల్దార్‌ : భూమిని కౌలుకు తీసకునేవాడు

కమతం : భూమి విస్తీర్ణం

ఇలాకా : ప్రాంతం

ఇనాం: సేవలను గుర్తించి ప్రభుత్వం ఇచ్చే భూమి

బాలోతా ఇనాం :
భూమిలేని నిరుపేద దళితులకు ప్రభుత్వం ఇచ్చే భూమి

సర్ఫేఖాస్‌ : నిజాం నవాబు సొంత భూమి

సీలింగ్‌ : భూ గరిష్ఠ పరిమితి

సర్వే నంబర్‌ : భూముల గుర్తింపు కోసం కేటాయించేది.(మనిషికి పేరు లాగా)

నక్షా : భూముల వివరాలు తెలిపే చిత్రపటం

కబ్జాదార్‌ : భూమిని తన ఆధీనంలో ఉంచుకుని అనుభవించే వ్యక్తి

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ) : భూ స్వరూపాన్ని తెలియజేసే ధ్రువీకరణ పత్రం. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబర్‌ భూమికి జరిగిన లావాదేవీలను తెలియజేసే దాన్ని ఈసీ అంటారు.

ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ (ఎఫ్‌ఎంబీ) బుక్‌ :
దీన్నే ఎఫ్‌ఎంబీ టీపన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. ఇందులో గ్రామంలోని అన్ని సర్వే నంబర్లు, పట్టాలు, కొలతలు ఉంటాయి.

బందోబస్తు వ్యవసాయ భూములను సర్వే చేసి వర్గీకరణ చేయడాన్ని బందోబస్తు అంటారు.

బీ మెమో : ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వ్యక్తి శిస్తు, జరిమానా చెల్లించాలని ఆదేశించే నోటీస్‌ను బీ మెమో అంటారు.

పోరంబోకు : భూములపై సర్వే చేసే నాటికి సేద్యానికి పనికిరాకుండా ఉన్న భూములు. ఇది కూడా ప్రభుత్వ భూమే.

ఫైసల్‌ పట్టీ : బదిలీ రిజిస్టర్‌

చౌఫస్లా : ఒక రెవెన్యూ గ్రామంలో ఒక రైతుకు ఉన్న వేర్వేరు సర్వేనంబర్ల భూముల పన్ను ముదింపు రికార్డు.

డైగ్లాట్‌ : తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ముద్రించిన శాశ్వత ఏ-రిజిస్టర్‌.

విరాసత్‌/ఫౌతి భూ యజమాని చనిపోయిన తర్వాత అతడి వారసులకు భూమి హక్కులు కల్పించడం.

కాస్తు : సాగు చేయడం

మింజుములే : మొత్తం భూమి.

మార్ట్‌గేజ్‌ : రుణం కోసం భూమిని కుదవపెట్టడం.

మోకా : క్షేత్రస్థాయి పరిశీలన(స్పాట్‌ఇన్‌స్పెక్షన్‌).

పట్టాదారు పాస్‌ పుస్తకం : రైతుకు ఉన్న భూమి హక్కులను తెలియజేసే పుస్తకం.

టైటిల్‌ డీడ్‌ భూ హక్కు దస్తావేజు, దీనిపై ఆర్డీవో సంతకం ఉంటుంది.

ఆర్వోఆర్‌ (రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌) : భూమి యాజమాన్య హక్కుల రిజిస్టర్‌.

*ఆర్‌ఎస్సార్‌ * రీ సెటిల్‌మెంట్‌ రిజిస్టర్‌ లేదా శాశ్వత ఏ రిజిస్టర్‌.

పర్మినెంట్‌ రిజిస్టర్‌ :
సర్వే నంబర్ల వారీగా భూమి శిస్తులను నిర్ణయించే రిజిస్టర్‌. సేత్వార్‌ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టారు.

సేత్వార్‌ : రెవెన్యూ గ్రామాల వారీగా మొదటి సారి చేసిన భూమి సర్వే వివరాలు, పట్టాదారుల వివరాలు తెలిపే రిజిస్టర్‌. ఇది 1953 దాకా అమలులో ఉంది. తర్వాత ఖాస్రా పహాణీ అందుబాటులోకి వచ్చింది.

సాదాబైనామా : భూ క్రయ విక్రయాలకు సంబంధించి తెల్లకాగితంపై రాసుకొనే ఒప్పంద పత్రం.

*దస్తావేజు * భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం లాంటి ఇతరత్ర లావాదేవీలను తెలియజేసే పత్రం.

ఎకరం భూమి విస్తీర్ణం కొలమానం. 4840 చదరపు గజాల స్థలంగానీ, 100 సెంట్లు (ఒక సెంటుకు 48.4 గజాలు)గానీ, 40గుంటలు (ఒక గుంటకు 121 గజాలు)ను ఎకరం అంటారు. ఆంధ్రా ప్రాంతంలో సెంటు, తెలంగాణలో గుంట అని అంటారు.

అబి వానకాలం పంట

ఆబాది : గ్రామకంఠంలోని గృహాలు లేదా నివాస స్థలాలు

అసైన్‌మెంట్‌ ప్రత్యేకంగాకేటాయంచిన భూమి

శిఖం చెరువు నీటి నిల్వ ఉండే ఏరియా విస్తీర్ణం

బేవార్స్‌ హక్కుదారు ఎవరో తెలియకపోతే దాన్ని బేవార్స్‌ భూమి అంటారు.

దో ఫసల్‌ రెండు పంటలు పండే భూమి

ఫసలీ జులై 1నుంచి 12 నెలల కాలన్ని ఫసలీ అంటారు.

నాలా వ్యవసాయేతర భూమి

ఇస్తిఫా భూమి పట్టదారు స్వచ్ఛందంగా ప్రభుత్వపరం చేసిన భూమి

*ఇనాం దస్తర్‌దాన్‌ :
పొగడ్తలకు మెచ్చి ఇచ్చే భూమి

ఖాస్రాపహానీ ఉమ్మడి కుటుంబంలో ఒక వ్యక్తి పేరుమీద ఉన్న భూ రికార్డులను మార్పు చేస్తూ భూమి పట్టా కల్పించిన పహాణీ.

గైరాన్‌ సామాజిక పోరంబోకు

యేక్‌రార్‌నామా ఇరు గ్రామాల పెద్దల నుంచి సర్వేయర్‌ తీసుకునే గ్రామాల ఒప్పందం..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube