దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు

దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు

1
TMedia (Telugu News) :

దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు

టీ మీడియా, అక్టోబర్ 19, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండలం మున్సిపాలిటీ పరిధిలోని చెలిమిల్ల గ్రామం శివారులో సర్వే నంబర్ 301,303 లో ఒక్క ఎకరా ఇరవై గుంటల భూమికి యజమాన్లు దళిత కుటుంబానికి చెందిన గాడిముడి రాములు,జి మన్నెం తండ్రి పెద్ద కిష్టన్న వీరి భూమిలోకి రెండు నెలల క్రిందట చెలిమిల్ల గ్రామానికి చెందిన బోయ కంచ గోపాల్ తండ్రి ఎర్ర రాములు అను వ్యక్తి దౌర్జన్యంగా వారి కుటుంబ సభ్యులతో భూమి లోకి ప్రవేశించి భూమి యజమానులైన జి రాములు జి మన్నెం అను ఇద్దరినీ అసభ్య పదజాలంతో నానాబూతులు తిడుతూ కొట్టడానికి ప్రయత్నించగా, అట్టి విషయం పై రెండు నెలల క్రిందట ఇద్దరు అన్నదమ్ములు పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చెయ్యడం జరిగింది.

Also Read : ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పోరాటం: చంద్రబాబు పవన్

అట్టి విషయం పై స్వందించిన ఎస్సై రామస్వామి అప్పటి నుండి ఇరుఉరి మధ్యలో రాజి కుదుర్చే ప్రయత్నం చేస్తున్నా బోయ కంచ గోపాల్ వినడం లేదు అందులో భాగంగా సోమవారం పోలీస్ స్టేషన్ కు వచ్చిన బోయ కంచ గోపాల్ పెబ్బేరు పోలీస్ స్టేషన్ లో నే భూ యజమాని దళిత జర్నలిస్ట్ మన్నెం ను ఉద్దెశించి ఏంరా మన్నెం తమాషా చేస్తున్నావా మాదిగ కొడుకా ఎస్సై ముందరనే… చెప్పుతున్నా.త్వరలో నిన్ను లేకుండా చేస్తా ఏమనుకుంటున్నావ్ బే గత్తి లేని నా కొడుకా అంటూ పోలీస్ స్టేషన్ లోనే భయబ్రాంతులకు గురి చేశారు. రాయలేని బాషలో అసభ్య పదజాలం తో తిట్టారు. అట్టి విషయం పై బాధితుడు జి మన్నెం దళిత సంఘాలను ఆశ్రయించాడు. స్పందించిన దళిత సంఘాల నాయకులు గంధం నాగరాజు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మెంబర్ వనపర్తి జిల్లా, మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు రాజనగరం రాజేశ్, బేడ బుడగ జంగం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎడవల్లి భాస్కర్, మాదిగ విద్యార్థి జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు, మంగళవారం పెబ్బేరు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు తక్షణమే అతనిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ఫిర్యాదులో ఎస్సై రామస్వామిని కోరరు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube