అక్రమార్కుల నుంచి భూమిని రక్షించాలి

అక్రమార్కుల నుంచి భూమిని రక్షించాలి

1
TMedia (Telugu News) :

అక్రమార్కుల నుంచి భూమిని రక్షించాలి

టీ మీడియా, అక్టోబర్ 19, వనపర్తి బ్యూరో : జిల్లా బుద్ధారం గ్రామ ప్రజల కోరిక మేరకు బుద్ధారం గ్రామం ఆనుకుని ఉన్న 237సర్వే నెంబర్లో ప్రజలకు అవసరం లేని చోట స్మశానం పక్కన గుడి కట్టడాన్ని పరిశీలించి అక్కడ అక్రమార్కులు ఆక్రమణ చేయాలనే ఉద్దేశం స్పష్టంగా కనిపించడంతో అక్కడ కట్టడాన్ని ఆపివేసిన ఐక్యవేదిక
ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ 237 సర్వే నెంబర్లు ప్రభుత్వ భూమి ఉంటే గత మూడు సంవత్సరము క్రితం డిసెంబర్లో బుద్ధారం వాసి చనిపోవడంతో అక్కడే ఉన్న స్మశాన వాటిక తరలిస్తుంటే అక్కడ ఆ ఆక్రమించుకోవడానికి ఉన్న కొందరు శవాన్ని ఇక్కడ పాతి పెట్టడానికి వీలు లేదంటే ప్రజలంతా మూకుమ్మడిగా వ్యతిరేకించి అక్కడ స్మశాన వాటికకు ఆ భూమి కావాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతిని అడగగా వెంటనే రెండు ఎకరాల 30 గుంటలు స్మశానం కోసం కేటాయించారని గ్రామస్తులు తెలుపుతున్నారు.

Also Read : కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి మల్లికార్జున్‌ ఖర్గే కైవసం

కానీ కొందరు చుట్టుపక్కల భూములు ఉన్నవారు ఈ సర్వే నెంబర్ను ఆక్రమించుకొని ఇందులో నుండి రోడ్డు సౌకర్యం కల్పించుకోవాలంటే అక్కడ ఒక గుడి గట్టి రోడ్డు వేయవచ్చని దుర్బుద్ధితో ఈ నిర్మాణం చేస్తున్నారు అని తెలుపడం జరిగింది.బుధవారం మేము వచ్చి పని ఆపితే ఆగింది మరి అదే అధికారులు ఎందుకు ఆపడం లేదు దీని వెనక ఎవరో పెద్ద మనుషులు ఉన్నారని తెలుస్తుంది ప్రభుత్వ భూమి దొరకాలంటే చాలా కష్టంగా ఉంది ఉన్న భూమి ఇలా అక్రమార్కులు ఆక్రమించుకుంటే ప్రజలు ఏం చేయాలని అడుగుతున్నారు.
వెంటనే సంబంధిత అధికారులు గానీ జిల్లా కలెక్టర్,మంత్రి నిరంజన్ రెడ్డి కల్పించుకుని అక్కడ స్మశాన వాటిక లేదా ప్రజలకు ఉపయోగపకరమైన ఏర్పాటు చేయాలని అక్రమార్కుల నుంచి ఆ భూమి రక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులతోపాటు బుద్దారం గ్రామస్తులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube