3హాస్పిటల్స్ 2 ల్యాబ్స్ సీజ్. -లక్షెట్టిపేట్ లో జిల్లా వైద్యాధికారుల టీం ఆకస్మిక తనిఖీలు

-కలెక్టర్ ఆదేశాలతో బోగస్ హాస్పిటల్స్ హైరానా.

0
TMedia (Telugu News) :

3హాస్పిటల్స్ 2 ల్యాబ్స్ సీజ్.

-లక్షెట్టిపేట్ లో జిల్లా వైద్యాధికారుల టీం ఆకస్మిక తనిఖీలు.

-కలెక్టర్ ఆదేశాలతో బోగస్ హాస్పిటల్స్ హైరానా.

టి మీడియా, ఏప్రిల్ 07 ,లక్షెట్టిపేట:పట్టణంలోని అనుమతులు లేని పలు ప్రయివేట్ హాస్పిటల్స్, క్లినికల్ ల్యాబ్స్ పై గురువారం సాయంత్రం జిల్లా వైద్యాధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు చేసి,సీజ్ చేశారు.జిల్లా వైద్యాధికారి సుబ్బారాయుడు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని పలు ఆస్పత్రులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గత కొన్ని రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రయివేట్ ఆసుపత్రులకు ,ల్యాబ్స్ కు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

Also Read :దోమలు కొందరినే కుడతాయెందుకు? కార‌ణం ఏమై ఉంటుంది

అంతేకాకుండా జిల్లాలోని డాక్టర్స్ వివరాలకు, విద్యార్హతలు,ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల గురించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిలో భాగంగా లక్షెట్టిపేట్ లోని సాయి సాకేత్,లక్ష్మీ గణపతి,అక్షర డెంటల్ హాస్పిటల్స్,డాక్టర్స్ ల్యాబ్,హెల్త్ కేర్ ల్యాబ్ లు సరైన అనుమతులు లేకుండా రోగులకు చికిత్సన0దిస్తున్నట్లు తనిఖీల్లో తేలడంతో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ తనిఖీల్లో వైద్యబృందం సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube