రోడ్డు విస్తరణ పనుల్లో ఆలస్యం
టీ మీడియా, మే 6, వనపర్తి బ్యూరో : అన్ని రాజకీయ పార్టీల నాయకులు వనపర్తి రోడ్డు విస్తరణ పనులకు నిబంధనలకు అనుగుణంగా సహకరించాలి. ఆదివారం జరిగిన అఖిలపక్ష ఐక్యవేదిక నిర్వహించిన విలేకరుల సమావేశంలో అఖిల పక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూగత రెండు సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలో,పాత బస్తీలోని పేదల ఇళ్లను మాత్రమే రోడ్డు విస్తరణలో భాగంగా తీసివేయడం జరిగింది.అది కూడా డబుల్ బెడ్ రూమ్ ఆశచూపి బలవంతంగా తీసివేయడం జరిగింది. బడా నాయకులు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధుల ఇళ్లను మాత్రము తీయడం లేదు.ఎందుకు ఈ వివక్ష మొదట ప్రభుత్వ కార్యాలయాలు, బస్సు డిపో ప్రాంగణము, ఆర్డీవో ఆఫీస్ ప్రాంగణముతో పాటు వనపర్తి లోని రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధులు ఇళ్లను షాపులను ఎందుకు తీయడం లేదు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, జిల్లా పాలనాధికారి కలెక్టర్ యాస్మిన్ భాష సమాధానం చెబుతూ వెంటనే బడా నాయకులు, అన్ని రాజకీయ నాయకుల రోడ్డు వెడల్పు లో భాగంగా తీసివేసి అందరికీ ఆదర్శంగా ఉండాలి. అలాగే వారికి చట్టపరంగా న్యాయపరంగా వచ్చే నష్ట పరిహారంను ఇవ్వాలి.
Also Read : డేంజర్ బెల్స్.. 27 దేశాలకు పాకిన వైరస్
గత కొద్ది కాలంగా ఇండ్లు కుల్లగొట్టిన మట్టితో రోడ్లఅంత మట్టితో అందరూ నానా యాతన పడ్డారు. ఇప్పుడు వర్షాకాలం రానుంది కనుక రోడ్లు వేయకపోతే గుంతలు దాంట్లో బురదతో ఓరి నోట్లు వేయడానికి మాత్రమే పనికి వస్తాయి వనపర్తి రోడ్లు
కనుక రాజకీయ నాయకుల ఇళ్లను తీసివేస్తే మిగతావారు వారి దారిలోనే అందరు తీసి వేసుకుంటారు. కనుక దయవుంచి అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి ప్రజాప్రతినిధులకు అన్ని పార్టీల నాయకులకు నమస్కరించి తెలియజేయునది ఏమనగా రోడ్డుపై ఉన్న మేమే ఇళ్లను రోడ్డు వెడల్పుకు అనుగుణంగా తీసివేసి. సంబంధిత అధికారులతో ఐక్య వేదిక వేడుకుంటుంది. వనపర్తి ప్రజల కష్టాలు వర్ణనాతీతం కనుక మీరంతా ప్రజాశ్రేయస్సు కోరిన వారైతే వెంటనే మీ ఇళ్ళను అధికారులు ఇచ్చిన మాకు ఎంత ఉంటే అంత తీసి వేయగలరు. ఇది ప్రజా శ్రేయస్సు కు అనుగుణంగా మేము ఇచ్చిన విలేకరుల సమావేశం మాత్రమే అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిరంజీవి , కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్, భాస్కర్, రమణ తదితరులు పాల్గొన్నారు.