బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆర్థిక సహాయంతో బ్యూటీ పార్లర్ ప్రారంభం.

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్22, మధిర:

మధిర పట్టణంలోని రామాలయం రోడ్డు నందు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆర్థిక సహాయంతో తుళ్లూరు యామిని ఐశ్వర్య హెర్బల్ బ్యూటీ పార్లర్ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా శర్మ గారు మాట్లాడుతూ…. బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎన్నో రకాల పథకాలను రూపకల్పన చేసిన తెలంగాణ రాష్ట్ర పరిషత్ చైర్మన్ కె.వి.రమణాచారికు సీఈఓ చంద్రమోహన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా అర్హులైన నిరుపేద బ్రాహ్మణులందరూ తెలంగాణ బ్రాహ్మణ పారిశ్రామికవేత్తల బెస్ట్ పథకాన్ని సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. ఈ సందర్భంగా ఐశ్వర్య హెర్బల్ బ్యూటీ పార్లర్ యామిని రాష్ట్ర పరిషత్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అవధానుల లక్ష్మి సుబ్రహ్మణ్య శాస్త్రి, జక్కేపల్లి మురళీకృష్ణ, శివరాజు శ్రీనివాసరావు, గడ్డమణుగు శ్రీనివాసరావు, కప్పగంతు పట్టాభి రామశర్మ , హరి రవిశాస్త్రి, వెల్లంకి రాజేశ్వర ప్రసాద్,గడ్డమణుగు రామభద్రం, మాటూరు వెంకట మురళీకృష్ణ, విరిజా తదితరులు పాల్గొన్నారు.

Launch of beauty parlor with financial assistance from the Brahmin Welfare Parishad.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube