ప్రజా పరిపాలనా కార్యక్రమం ప్రారంభం

ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

ప్రజా పరిపాలనా కార్యక్రమం ప్రారంభం

– ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఎమ్మెల్యే

– మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

టీ మీడియా, డిసెంబర్ 28, గోదావరిఖని : ప్రజా పరిపాలన ప్రారంభ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన సభలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే కార్యక్రమంలో భాగంగా నేడు ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా అభయ హస్తం పథకం కింద 6 గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి, గృహలక్ష్మి,గృహజ్యోతి,చేయూత సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణను 29 డివిజన్ బాపూజీ నగర్ గోదావరిఖని లో గురువారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ప్రారంభించడం జరిగినది,అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ… గడిచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజలంతా భారీ మెజారిటీతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన సందర్భంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకం అందాలన్నదే కాంగ్రెస్ పార్టీ సంకల్పమని ప్రతి హామీని నెరవేర్చే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని నా శాయ శక్తుల నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకం అందే విధంగా పనిచేస్తానని అంతేగాకుండా ఎవరైనా దళారులు లబ్ధిదారులతో పథకాలను

Also Read : మనీలాండరింగ్ కేసు.. ప్రియాంకా గాంధీకి షాకిచ్చిన ఈడీ

అందే విధంగా ప్రలోభాలకు గురి చేసినట్లయితే వెంటనే నాకు గానీ సంబంధిత పోలీసు అధికారులకు గానీ సమాచారం ఇచ్చినట్లయితే వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని నిరుపేద ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని మాట్లాడటం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, రామగుండం కార్పొరేషన్ మేయర్ బంగి అనిల్ కుమార్,అసిస్టెంట్ కలెక్టర్ అరుణశ్రీ, కార్పొరేషన్ కమిషనర్ నాగేశ్వరరావు,సంబంధిత అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube