వైయస్సార్ తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర సభ్యురాలిగా లక్ష్మి

వైయస్సార్ తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర సభ్యురాలిగా లక్ష్మి

1
TMedia (Telugu News) :

వైయస్సార్ తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర సభ్యురాలిగా లక్ష్మి

టీ మీడియా,అక్టోబర్ 19,జన్నారం : మండలానికి చెందిన సిరికొండ లక్ష్మి వైయస్సార్ తెలంగాణ పార్టీ నిర్మల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు గా కొనసాగుతున్నారు. ఆమె పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ జన్నారం మండలంలో పార్టీని మరింత పటిష్టం చేస్తూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన కార్యక్రమాలను గుర్తించి రాష్ట్ర కమిటీ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్సార్ షర్మిల ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళా విభాగం కమిటీ సభ్యురాలిగా నియమిస్తూ పార్టీఆఫీసు నుండి ఆమెకు ఆదేశాలు జారీ చేశారు.

Also Read : అక్రమార్కుల నుంచి భూమిని రక్షించాలి

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ నాపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించినందుకు పదవికి తగిన న్యాయం చేస్తూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర మహిళా విభాగం కమిటీ సభ్యురాలిగా ఆమెను నియమించినందుకు మండల నాయకులు జిల్లా నాయకులు ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube