మార్కెట్ యార్డ్ సందర్శించిన నాయకులు

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 20 వనపర్తి : భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి రద్దు చేయించిన కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్షాలు విజయం సాధించారు. ఇందులో భాగంగా ఐసీసీ ప్రకటించిన కిసాన్ విజయ దివాస్ కార్యక్రమంలో శనివారం రోజు వ్యవసాయ మార్కెట్ సందర్శించి అక్కడ ఉన్న వడ్లను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు అంతేకాక అక్కడ ఉన్న వడ్లను కొనాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా టిపిసిసి కార్యదర్శి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు నాటకాలు ఆడుతూ 700 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.

వారి పాపం ఊరికే పోదు అది మీకు తగులుతుందని రైతులను అనవసరంగా వేధించేవాడికి కచ్చితంగా ఉసురు తగులుతుందని రైతులకు కష్టం కాకుండా చూడాలని రైతుల వాదనను కెసిఆర్ ప్రత్యక్షంగా చూసి నిర్ణయాలు తీసుకోవాలని అలాగే బీజేపీ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకుడు కొత్త కాపు శివసేనరెడ్డి, డిసిసి అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, వంశీకృష్ణ, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, యువజన నాయకులు కొండసాగర్, మహేశ్వర్ రెడ్డి, ఆవుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

The Congress Party and the Left, which fought against the black laws brought by Indian Prime Minister Narendra Modi.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube