కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

1
TMedia (Telugu News) :

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి

టీ మీడియా, జూన్ 15, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లాలోని సంస్థాగత ఎన్నికల నిర్వహణకు వనపర్తి జిల్లా కు DRO గా ఉమేష్ విటల్ భాటియా ఎన్నికల నిర్వాహకుడిగా నియమించడం జరిగింది. కావున మంగళవారం వనపర్తికి వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి స్థానిక కౌన్సిలర్ మరియు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గ్రామంలోని బూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని పెద్దఎత్తున గెలిపించాలని అన్నారు. కెసిఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను చేయలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు, తెలంగాణ ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇస్తానని ఇవ్వలేదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన నష్టాలు ఎన్నో ఉన్నవి తెలంగాణ ప్రజలకు కెసిఆర్ మీద విరక్తి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ముగ్గు చూపుతున్నారు.

Also Read : మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం

రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రైతు రచ్చబండ కార్యక్రమంలో ప్రజల మాటగా చెబుతున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నేను చిన్నారెడ్డికి, శివసేన రెడ్డికి గాని అది స్థానం ఎవరికి టికెట్ ఇచ్చిన వనపర్తి నియోజకవర్గం లో ఇద్దరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఇద్దరం కష్టపడి పని చేస్తామని కార్యకర్తలకు మాజీ మంత్రి చిన్నారెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారు మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు రేపు రాబోయే ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని బేధాభిప్రాయాలు లేకుండా వనపర్తి నియోజకవర్గంలోని అన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోయి రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అందరూ కష్టపడి పనిచేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు పిలుపునివ్వడం జరిగింది. ఈ వనపర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డి గాని శివసేన రెడ్డి మధ్య వివాదాలు లేవు ఇద్దరం కాంగ్రెస్ పార్టీ నాయకుల కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం టిఆర్ఎస్ పార్టీ మాపై ఎన్నో కేసులు పెట్టినా భయపడేది లేదని ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే వరకు యూత్ కాంగ్రెస్ కలిసికట్టుగా పని చేస్తుందన్నారు.

Also Read : ప్రపంచ రక్త దాతల దినోత్సవ అవాగహన ర్యాలీ
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు శంకర్ ప్రసాద్, పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, శ్రీరంగాపురం జడ్పిటిసి రాజేంద్ర ప్రసాద్ యాదవ్, దేవరకద్ర నియోజకవర్గం మధుసూదన్ రెడ్డి, కాటన్ ప్రదీప్ కుమార్ గౌడ్, మక్తల్ నియోజకవర్గం శ్రీహరి, కొల్లాపూర్ నియోజక వర్గం జగదీశ్వర్ రావు, అభిలాష రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు ధనలక్ష్మి, వనపర్తి పట్టణ అధ్యక్షుడు డి కిరణ్ కుమార్, కమ్మర్ మియా, గంధం రాజశేఖర్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ , యాదగిరి, సహదేవ్ యాదవ్, గణేష్ గౌడ్, కోట్ల రవి, కౌన్సిలర్ బ్రహ్మం, చీర్ల జనార్ధన్,విష్ణు రెడ్డి ,దివాకర్ యాదవ్, పాండు సాగర్, మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్, సేవాదళ్ జిల్లా అధ్యక్షులు గొర్ల జాన్, మన్యంకొండ, నాగరాజ్, భాస్కర్ ,లక్ష్మయ్య, శివ ,శివ శంకర్, ఇంద్ర ,నాగన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube