కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

0
TMedia (Telugu News) :

కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

టీ మీడియా, జనవరి 30, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు వారణాసి కల్పన ఆధ్వర్యంలో ఏఎస్పీ షాకీర్ హుస్సేన్ కి సోమవారం వినతిపత్రం ఇవ్వడం అందజేశారు.ఎమ్మెల్సీ పాడే కౌశిక్ రెడ్డి గవర్నర్ తమిళ సై సౌందర్యరాజాన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి జ్యోతి రమణ, అధ్యక్షురాలు వారణాసి కల్పన మాట్లాడుతూ ఎమ్మెల్సీ పాడే కౌశిక్ రెడ్డి గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం సభ్య సమాజానికి సిగ్గుచేటని, బిల్లుల ఆమోద ప్రక్రియ పై అవగాహన లేదని మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో తెలియని సంస్కారహీనుడని ఇంతవరకు ముఖ్యమంత్రి అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్సీ కవిత ఎందుకు స్పందించడం లేదు. గవర్నర్ పై అంత అసభ్యంగా మాట్లాడినందుకు కౌశిక్ రెడ్డిని ఏం చేయాలని అతనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

Also Read : కంటివెలుగు ప్రారంభించిన జడ్పిటిసి

తక్షణమే ముఖ్యమంత్రి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించాలని అంతేకాకుండా కౌశిక్ రెడ్డి గవర్నర్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని తన మాటలు వెనక్కి తీసుకోవాలని లేదంటే తెలంగాణ మహిళలే అతనికి పాడె కడతారని తెలంగాణ ప్రజలు అన్ని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి జ్యోతి రమణ ,జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి సరోజ ,పట్టణ ప్రధాన కార్యదర్శి బండి పుష్ప ,జ్యోతి, విమల శిరీష, సరిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube