మాయ, మోసపు మాటలు చెప్పే పార్టీలకు గుణపాఠం చెప్పాలి

కలసి కట్టుగా సాగుదాం.. కేసీఆర్ ను సీఎం చేసుకుందాం

0
TMedia (Telugu News) :

మాయ,మోసపు మాటలు చెప్పే పార్టీలకు గుణపాఠం చెప్పాలి

– కలసి కట్టుగా సాగుదాం.. కేసీఆర్ ను సీఎం చేసుకుందాం

– ఎంపి నామ నాగేశ్వరరావు

టీ మీడియా, నవంబర్ 23, ఖమ్మం బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల హృదయాల్లో బీఆర్ఎస్ ప్రతిధ్వనిస్తుందని, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయ మైందని ఆ పార్టీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభివృద్ధి ప్రదాతకు మళ్లీ ఘనంగా పట్టం గట్టేందుకు తెలంగాణా ప్రజలు పోలింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు జరిగిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేటతెల్లం చేశాయని అన్నారు. కేసీఆర్ వస్తేనే అభివృద్ధి అని లేకుంటే అధోగతేనని ప్రజలు ప్రబలంగా విశ్వషిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడ సభ జరిగినా జనం తండోపతండా లుగా తరలి వచ్చి, మేము మీ వెంటే ఉన్నామని, తమ మద్దతు బీఆర్ఎస్ కే ఉందని అభయం ఇస్తున్నారని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు బ్రహ్మాoడంగా విజయవంతం చేశారని గుర్తు చేశారు. జిల్లాలో అన్ని సీట్లను బీఆర్ఎస్ కైవశం చేసుకుంటుం దని పేర్కొన్నారు. కేవలం 10 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణాలో అన్ని రంగాలు నెంబర్ వన్ ప్రగతిని సాధించాయని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహoతో అన్నదాతలు సగర్వంగా పెద్ద ఎత్తున పంటలు పండిస్తూ దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగారని అన్నారు.ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసంతో ముందుకెళుతున్నారని అన్నారు. కాంగ్రెస్ హయంలో కటిక చీకట్లో మగ్గిన తెలంగాణలో నేడు కేసీఆర్ వల్ల వెలుగు జిలుగులు విరజిల్లుతున్నాయని అన్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందుతుందంటే ఆ క్రెడిట్ సీఎం కేసీఆర్ దేనని అన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ రాష్ట్రాన్ని చిమ్మ చీకట్లు కమ్ముకుంటా యని నామ అన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని నిలువరించా లని అన్నారు. ఆకలి బాధలు లేని బంగారు తెలంగాణా కావాల్నంటే మూడోసారి కేసీఆర్ సీఎం కావాల్సిందేనని నామ స్పష్టం చేశారు.

Also Read ; కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కోతలే

తెలం గాణా మరింత అభివృద్ధి చెంది ఇంకా ముందుకు పోవాలన్నా… యువత బాగుపడాలన్నా కేసీఆర్ కు ప్రజల ఆశీస్సులు దండిగా మెండుగా అంది వ్వాలని నామ విజ్ణప్తి చేశారు. ఎవరెన్ని మాయ మోసపు మాటలు చెప్పి, మభ్యపెట్టినా మూడోసారి కేసీఆర్ నాయక త్వంలో ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని అన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం గా చూసి తీరాల్సిందేనని అన్నారు. ఓట్లప్పుడు వచ్చి మభ్యపెట్టే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధి కారంలోకి రావడం కల అన్నారు. బీఆర్ఎస్ అత్యధిక సీట్లతో అధికారంలోకి రాబో తుందని నామ చెప్పారు. తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర మాలు, ప్రగతి ఫలాలను ఇంటింటికెళ్లి వివరించి, ప్రజల్ని చైతన్య పర్చాలని కోరారు. చిన్న చిన్న సమస్యలను పక్కకు పెట్టి, అంతా సమైఖ్యo గా ఎన్నికల ప్రచార కదన రంగంలోకి దూసుకుపోదామని నామ నాగేశ్వరరావు అన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube