అందరం కలిసి బడిని బాగు చేసుకుందాం

అందరం కలిసి బడిని బాగు చేసుకుందాం

1
TMedia (Telugu News) :

అందరం కలిసి బడిని బాగు చేసుకుందాం

టీ మీడియా, డిసెంబర్ 17, వనపర్తి బ్యూరో : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మణిగిల్లలో శనివారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రుల ఎదుట ప్రదర్శించారు. పాఠశాల అభివృద్ధికి చేయవలసిన పనులను ప్రధానోపాధ్యాయులు శంకర్ గౌడ్ తల్లిదండ్రులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎస్ఎంసి చైర్మన్ పద్మజ మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని సూచించారు. గ్రామస్తుల సహకారంతో ఉపాధ్యాయుల కొరతను ఎదుర్కొనడానికి, మౌలిక వసతులు కల్పించుకోవడానికి అందరం కలిసి పని చేస్తూ బడిని అభివృద్ధి చేద్దామని తల్లిదండ్రులకు సూచించారు. ఆ తర్వాత తల్లిదండ్రులు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.

Also Read : జనహిత అన్నపూర్ణ అన్నదాన కార్యక్రమం

భోజనం రుచి, నాణ్యత పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.శంకర్ గౌడ్, ఎస్ఎంసి చైర్మన్ పద్మజ,విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు గౌడ్, నాగేశ్వరమ్మ, విష్ణువర్ధన్, విజయ్ కుమార్, సురేఖ, బాలాజీ, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube