రాయల అభివృద్ధిని కొనసాగిస్తాం
-రాయల కుటుంబానికి అండగా ఉంటాం
-సేవే ప్రజల్లో మిగిలిపోవుతుంది
-రాయల నాగేశ్వరరావు సంతాప సభలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు నివాళి
నిస్వార్థ ప్రజా సేవకుడు రాయల నాగేశ్వరావు అని బీఆర్ఎస్ లోక్ సభ పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామ నాగేశ్వరరావు నివాళ్లు అర్పించారు. ఆదివారం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో జరిగిన. రాయల నాగేశ్వరావు సంతాప సభలో ఎంపీ నామ మాట్లాడారు.
also read:దేశంలోఆపద కాలం నడుస్తోంది
రాయల ఉన్న ఆస్తులు పోగొట్టుకుని జీవితాంతం ప్రజలకు నిస్వార్ధ సేవ చేశారని అన్నారు. గ్రామాభివృద్ధికి ఎంతో శ్రమించారన్నారు. 25 ఏళ్ల క్రితం గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడినప్పుడుఆయన కోరిక మేరకు తమ తండ్రి నామ ముత్తయ్య ట్రస్ట్ ద్వారా గ్రామంలో ట్యాoకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు ఆయన ఎంతగానో కృషి చేశారని చెప్పారు .ఒక మంచి వ్యక్తిని కోల్పోవటం బాధాకరమని అన్నారు. గ్రామంలో జరిగిన అభివృద్ధిలో రాయల కష్టం ఉందన్నారు. అందుకే ఆయన చనిపోయిన రోజు పెద్దఎత్తున పాల్గొని కన్నీటిపర్యంతమయ్యారని, ఆ కన్నీటిలో రాయల కష్టం,సేవలు, ప్రేమ దాగి ఉందని చెప్పారు .
also read;పేపర్ లీకేజ్ పై కాంగ్రెస్ నిరసన
తనకు ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరి మీద భారం మో పకుండా ఆరోగ్యశ్రీ ద్వారాప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన ప్రజా నాయకుడని కొనియాడారు.ఇలాంటి నాయకుల సేవలు జీవితాంతం గుర్తుoటాయన్నారు .పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదని, వారు బతికున్నప్పుడు ఏం చేశామన్నదే ప్రజల్లో మిగిలిపోతుందని నామ చెప్పారు. కాబోయే రోజుల్లో రాయల కోరుకుని, మిగిలిపోయిన అభివృద్ధిని నెరవేర్చేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేస్తామని చెప్పారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.రాయల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని నామ తెలిపారు.తొలుత రాయల చిత్ర పటం వద్ద రాయల మృతికి నామ ఘనంగా నివాళి అర్పించారు.
కమ్మకుంట్లనాగేశ్వరావు
అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు , సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల నాగేశ్వరరావు, ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు , మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పిసిసి రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, గుర్రం అచ్చయ్య, రాయల చంద్రశేఖర్, తదితరులతో పాటు మృతుడు రాయల నాగేశ్వరరావు సతీమణి హైమావతి, కుమారుడు రాజ్ కుమార్, కుమార్తె వనజ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube