లివింగ్ రూంను అలంకరిద్దాం

లివింగ్ రూంను అలంకరిద్దాం

1
TMedia (Telugu News) :

లివింగ్ రూంను అలంకరిద్దాం

లహరి, డిసెంబర్20, ప్రతినిధి : కొత్తగా ఇల్లు కట్టుకొన్నారా? దానిలో లివింగ్ రూమ్ లేదా ఓ మంచి హాలును నిర్మించారా? ఇంటి లోపలికి రాగానే కనిపించే ఈ గదిని ఆకర్షణీయంగా తీర్చిద్దాలనుకుంటున్నారా? అది కూడా వాస్తుకు అనుగుణంగా రూపుదిద్దాలని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. వెంటనే చదివేయండి.. ఫాలో చేసేయండి..


వాస్తు ముఖ్యం..
మీ లివింగ్ రూంను డిజైన్ చేసేటప్పుడు వాస్తు శాస్త్రాన్ని దృష్టిలో ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు దూరం అవుతాయి. ఇంట్లోకి పాజిటివ్ లేదా నెగటివ్ ఎనర్జీని తీసుకురావడంలో వాస్తు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు మీ లివింగ్ రూమ్‌లో డిస్‌ప్లేలో ఉంచిన వస్తువుల ఎంపిక దిశ నుంచి తప్పనిసరిగా అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఇప్పుడు చుద్దాం..
– మీ ఫర్నిచర్ ఉంచేటప్పుడు, దక్షిణ, పడమర గోడలతో పోలిస్తే ఉత్తరం , తూర్పులు తేలికగా ఉండేటట్లు పెట్టాలి.
– బ్రహ్మస్థానం తక్కువ బరువుతో లేదా ఖాళీగా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. గది మధ్యలో టేబుల్‌ను ఉంచితే అది పెద్దగా ఉండకుండా, చిన్నదిగా ఉంటే బావుంటుంది.
– మీ డ్రాయింగ్ రూమ్ దక్షిణ లేదా పడమరన ఉన్న గోడపై అద్దం పెట్టవద్దు. దీని వల్ల ఆర్థిక నష్టాలు పెరిగే అవకాశం ఉంటుంది. అద్దాన్ని ఉత్తర లేదా తూర్పు గోడపై ఉంచాలి.
– గదికి ఉత్తర లేదా ఈశాన్య మూలలో చక్కని ఫౌంటైన్‌ని ఉంచితే.. అది మీ ఇంట్లో పాజిటివిటీని పెంచుతుంది.
– ముదురు రంగులను కాకుండా పేల్ లేదా పాస్టెల్ రంగులను ఉపయోగించండి. క్రీమ్, ఐవరీ వైట్. ఆకుపచ్చ-నీలం షేడ్స్ లో ఉంటే మంచిది.

Also Read : అపర కర్మ భవన నిర్మాణ పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన

– ఒకవేళ ఇనుప వస్తువులు లివింగ్ రూంలో పెట్టాల్సి వస్తే.. గదిలో పడమర వైపున ఉంచండి.
– పురాతన వస్తువులను కూడా గదిలో పడమర వైపు ఉంచవచ్చు.
– మనసుకు ఉత్తేజాన్ని కల్గించే పెయింటింగ్స్ వాల్స్ పై జోడించవచ్చు.
ఈ పెయింటిగ్స్ అయితే బెస్ట్..
– ఉత్తరం వైపు నీరు, జలపాతం లేదా సముద్రపు పెయింటింగ్‌ను ఉంచండి ఇది ఆర్థిక అవసరాలను తీర్చుతుంది.
– తూర్పు ప్రదేశంలో పరుగెత్తే తెల్లని గుర్రాల చిత్రాలు ఉంచండి .ఇవి పేరు, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయి.
– పశ్చిమం లేదా నైరుతిలో భారీ పర్వత శ్రేణితో కూడిన చిత్రాన్ని ఉంచండి, ఇది మీ జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుంది.
– గోడకు దక్షిణపు వైపు ఏదైనా ఒక శిల్పాన్ని ఉంచవచ్చు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube