ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు

- ఈ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎస్ఐ, తహశీల్దార్,

0
TMedia (Telugu News) :

ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు

– ఈ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎస్ఐ, తహశీల్దార్,

– ప్రతిభ కొలమానంగా‌ ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు

టీ మీడియా, డిసెంబర్ 26, మహానంది: క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను కొలమానంగా గుర్తించి, వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ జనార్దన్ శెట్టి, ఎస్ఐ నాగేంద్రప్రసాద్, వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి తెలిపారు.మంగళవారం మహానందిలో ఆడుదాం ఆంధ్ర పోటీలను క్రికెట్ ఆటతో తహసిల్దార్ జనార్దన్ శెట్టి, ఎస్ఐ నాగేంద్రప్రసాద్ క్రికెట్ ఆటను ఆడి క్రీడాకారులను ఉత్సాహ పరిచి ప్రారంభించగా, అలాగే గాజులపల్లె గ్రామంలో ఆడుదాం ఆంధ్ర క్రికెట్ క్రీడా పోటీలను వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి క్రికెట్ ఆటను ఆడి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ లక్ష్మీప్రసన్న, ఎంఈఓ 2 లింగన్న, సర్పంచ్లు చంటి, శిరీష,పంచాయితీ కార్యదర్శి ఇర్ఫాన్, లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

Also Read : జవనరి 1న స్కూళ్లు, బ్యాంకులకు సెలవు

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube