వర్గ భేదాలు లేకుండా కాంగ్రెస్ ను గెలుపించుకుందాం
టీ మీడియా, నవంబర్ 1, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట పేట మండలం మల్కారం పంచాయతీ లోని గుతవారి గూడెం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో దమ్మపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దిశెట్టి సత్య ప్రసాద్, దమ్మపేట మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సొంగ యేసుమణి పాల్గొని కాంగ్రెస్ పార్టీ అశారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ కేటాయించిన అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పొంగులేటి వర్గం మరియు తుమ్మల వర్గం మరియు భట్టి వర్గం అందరూ కలిసి ఎలాంటి విభేదాలు లేకుండా వర్గ పోరుకు అవకాశం లేకుండా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు . వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు.
Also Read : అభివృద్ధి కొనసాగాలంటే. మరోసారి అవకాశమివ్వండి
ఈ కార్యక్రమంలో చిన్నంశెట్టి యుగంధర్ గోపి శాస్త్రి , గంగాధర్ రావు, కలకుంట నాగు, మండల ఉపాధ్యక్షులు కిసాన్ సెల్ ఎస్కే షుగర్ ,ఓబీసీ అధ్యక్షుడు వెలివెల శ్రీనివాసరావు, దమ్మపేట పట్టణ అధ్యక్షుడు చెన్నం శెట్టి చిట్టిబాబు, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, కుంట రాజశేఖర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీరాముల ప్రసాద్,మండల మహిళా కాంగ్రెస్ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీపీ, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube