బీఆర్ఎస్‌గా ఎన్నికల కమిషన్‌కు తీర్మానం   

బీఆర్ఎస్‌గా ఎన్నికల కమిషన్‌కు తీర్మానం   

1
TMedia (Telugu News) :

బీఆర్ఎస్‌గా ఎన్నికల కమిషన్‌కు తీర్మానం 

 -ఎన్ని రోజులు పడుతుందంటే

టీ మీడియా,అక్టోబర్ 5,హైద్రాబాద్:

 

కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. ఇందుకు 283 మంది ప్రతినిధులు ఆమోదం తెలిపారు. సరిగ్గా నేడు మధ్యాహ్నం 1.19 గంటలకు టీఆర్‌ఎస్‌ను భారత్‌ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. తర్వాత తీర్మానంపై కేసీఆర్‌సంతకాలు చేశారు. పార్టీ ప్రతినిధులు, ఇతర రాష్ట్రాల నుంచి నేతల సమక్షంలో పార్టీ పేరును గులాబీ బాస్‌ వెల్లడించారు. దేశ రాజకీయాల్లోకి ఎందుకు వెళ్తున్నామో వారికి వివరించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, జీడీపీ, గడిచిన 8 సంవత్సరాల్లో వృద్ధి రేటు ఏ విధంగా దెబ్బతిందనే విషయాన్ని ఈ సమావేశంలో నిర్వహించారు. పార్టీ పేరు మార్పుపై సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్‌ బాడీ సమావేశంలో భారత్‌ రాష్ట్ర సమితిగా సవరణ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, అలాగే పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు వివరించారు.

also read :నాకు రాజకీయం ఒక టాస్క్

 

మరో వైపు పార్టీ సీనియర్‌ నేత వినోద్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డితో పాటు లీగల్‌ బృందం రేపు ఢిల్లీలో ఎన్నికల కమిషన్‌ను కలునున్నట్టు తెలుస్తోంది. తీర్మానం కాపీని ఎన్నికల అధికారులకు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ పార్టీ పేరు మార్పునకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించనున్నది. ఎన్నికల కమిషన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుకు సంబంధించి నిర్ధిష్ట గడువుతో అభ్యంతరాలు కోరే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఎన్నికల సంఘం అధికారికంగా భారత్‌ రాష్ట్ర సమితి అధికారికంగా ప్రకటించనుందిమరోవైపు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా గుర్తిస్తే పార్టీ కొత్త పేరు మీదే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు కొంత సమయం పట్టినా.. అప్పటివరకు టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్‌ను వాయిదా వేయాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. మంగళవారం మునుగోడు అభ్యర్థిగా ఉండబోయే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ రవీందర్ రావుతో పాటు మంత్రి హరీశ్ రావుతో కలిసి కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికపై సమీక్ష నిర్వహించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube