కువైట్ లో తిరుపతి మహిళకు విముక్తి

కన్నీటి గాథపై స్పందించిన భారత ఎంబసీ

1
TMedia (Telugu News) :

కువైట్ లో తిరుపతి మహిళకు విముక్తి..

-కన్నీటి గాథపై స్పందించిన భారత ఎంబసీ

టి మీడియా, జూన్1,తిరుపతి: ఏజెంట్లు తనను చిత్రహింసలు పెట్టి వేధిస్తున్నారంటూ కువైట్‌లో ఉపాధి కోసం వెళ్లిన ఓ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను కాపాడి స్వస్థలం తిరుపతి జిల్లాకు తీసుకురావాలని విలపిస్తూ వేడుకున్నారు. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. బాధిత మహిళ కన్నీటి గాథ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో భారత ఎంబసీ అధికారులు స్పందించారు. ఎజెంట్ల చెర నుంచి ఆమెను కాపాడి స్వస్థలం తిరుపతి పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

Also Read : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తన భార్యను కాపాడి స్వస్థలానికి పంపిచేందుకు సహకరించిన ఎంబసీ అధికారులకు బాధితురాలు శ్రావణి భర్త కృతజ్ఞతలు తెలిపారు. తన భార్య మాదిరిగా ఎంతో మంది కువైట్‌లో ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారు ఎంబసీ అధికారులను సంప్రదించి వారి సాయం పొందాలని సూచిస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. శ్రావణి కువైట్‌ నుంచి తిరుపతికి బయలుదేరుతున్న విషయం తెలుసుకున్న బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube