పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో అపశృతి

పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో అపశృతి

1
TMedia (Telugu News) :

పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో అపశృతి..

టి మీడియా,జూలై29,మహబూబ్‌నగర్‌: పాలమూరు లిఫ్ట్‌ పనుల్లో అపశృతి చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా కొల్లాపూర్‌ మండలం ఏలూరు శివార్లలోని రేగమనగడ్డ వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో రేగమనగడ్డ వద్ద పంపు హౌస్‌ను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులు క్రేన్‌ సహాయంతో పంపు హౌస్‌లోకి దిగుతుండగా.. క్రేన్‌ వైరు తెగిపోయింది.

 

Also Read : హైదరాబాద్‌లో సాయంత్రం ట్రాఫిక్‌ ఆంక్షలు

 

దీంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీగ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడికి సమీపంలోని దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతులను బీహార్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube