లింగ రుద్రాభిషేకం
టీ మీడియా, ఫిబ్రవరి 18, జన్నారం : మండల కేంద్రంలోని పోనకల్ గ్రామంలో గల మేదరి వాడలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం రోజున మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని వేద పండితులు గుండి నరహరి శర్మ ,గణేష్ శర్మ ఆధ్వర్యంలో మహా లింగ రుద్రాభిషేకం నిర్వహించారు.
మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం నుండే భక్తుల శివనామ స్మరణతో దేవాలయాలు మార్మోగాయి. భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గల లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తదనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో భక్తులు మహా రుద్రాభిషేకం నిర్వహించి శివరాత్రి రోజున మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జక్కు సత్తయ్య భాగ్యలక్ష్మి, నరేంద్రుల గోపాలకృష్ణ రూప, కొత్త శ్రీనివాస్ సవిత, కొమురవెల్లి అంజయ్య ఉమరని,కట్ట రాజమౌళి భవని దంపతులు భక్తులు ,తదితరులు పాల్గొన్నారు.