లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మోడల్స్ పేపర్స్ పంపిణీ

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వరావుపేట డిసెంబర్ 27

నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేట లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠ శాలలో మండలంలోని 11 ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు లైన్స్ క్లబ్ అశ్వరావుపేట వారి ఆధ్వర్యంలో మోడల్ పేపర్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ అధ్యక్షులు చలపతిరావు మాట్లాడుతూ ఈ మోడల్ పేపర్స్ ను ఉపయోగించుకుని పిల్లలందరూ పదో తరగతిలో మంచి మార్కులు సంపాదించాలని ఈ రోజుల్లో బాగా చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవాలి అంటే నేటి సమాజంలో మంచి గ్రేడ్ తో చదువు కోవటం ఒకటే మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు, ఉపాధ్యాయులు సలీం, ఉషా దేవి, శోభవాణి మరియు లైన్స్ క్లబ్ సభ్యులు బ్రహ్మరావు, ప్రకాశ రావు తదితరులు పాల్గొన్నారు.

Distribution of models papers under the auspices of lions club.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube