లిక్కర్‌ పార్టీ..

ఇద్దరు పోలీసులు, ఐదుగురు ఖైదీలు అరెస్ట్‌

1
TMedia (Telugu News) :

లిక్కర్‌ పార్టీ..

-ఇద్దరు పోలీసులు, ఐదుగురు ఖైదీలు అరెస్ట్‌

టీ మీడియా, డిసెంబర్ 2, పాట్నా: బీహార్‌లో గత కొన్నేండ్లుగా మద్య నిషేధం అమల్లో ఉన్నది. దాంతో అక్కడ గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మద్యం, నాటుసారా దందా కొనసాగుతున్నది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అక్రమ మద్యాన్ని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌కు చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌ రాజధాని పట్నాలోని పాలిగంజ్‌ పట్టణ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌లో వారిని లాకప్‌లో పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత కథ మలుపు తిరిగింది. అదేరోజు రాత్రి పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఐదుగురు ఖైదీలతో కలిసి సీజ్‌ చేసిన మద్యంతో పార్టీ చేసుకున్నారు.

Also Read : ముస్లింలకు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

అంతటితో ఆగక వారిలోని ఓ వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో తీసి తన కుటుంబసభ్యులకు పంపించాడు. దాంతో ఆ వీడియోలో వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఐదుగురు ఖైదీలతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్‌ చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube