నాటు సారా స్థావరాలపై దాడులు

నాటు సారా స్థావరాలపై దాడులు

1
TMedia (Telugu News) :

నాటు సారా స్థావరాలపై దాడులు

టీ మీడియా, మార్చి 12,మహానంది: మండల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీల పై సెబ్ అధికారులు శనివారం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. డ్రమ్ములో నిల్వచేసిన సార ఊటను ద్వంసం చేసినట్టు నంద్యాల డీటిఎఫ్ సెబ్ సీఐ స్వర్ణలత తెలిపారు. జిల్లా సెబ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు .పాలేరు వాగు వెంట నల్లమల అటవీ ప్రాంతంలో గత కొన్ని నెలల నుంచి యదేచ్ఛగా సారా బట్టి లను ఏర్పాటు చేసి అక్కడ నుండి సారాను ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు .సారా తయారీ కి సంబంధించిన వ్యక్తుల సమాచారం ఉందని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.ఈ దాడుల్లో నంద్యాల డీటీఎఫ్ సీఐ స్వర్ణలత, ఎస్‌ఐ కమలాకర్, ఎస్‌ఈబీ స్టేషన్ సీఐ నాగమణి, సిబ్బంది పాల్గొన్నారు.

Also Read : రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్లో జిల్లా వాసి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube