దళిత బంధు ఆందోళనకారుల లిస్టు పెద్దదే

820 దరఖాస్తులకు 300 ఫైనల్

0
TMedia (Telugu News) :

దళిత బంధు ఆందోళనకారుల లిస్టు పెద్దదే

– 820 దరఖాస్తులకు 300 ఫైనల్

– ఆన్లైన్ చేసే ప్రక్రియలో బయటపడ్డ నాయకుల బాగోతం

– ఎన్నికల కోడ్ తర్వాత కూడా కొనసాగిన అర్హుల జాబితా

టీ మీడియా, డిసెంబర్ 6, అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దళిత బంధు పథకంలో ఆశావాహుల లిస్టు చాలా పెద్దదిగానే ఉంది. నియోజవర్గానికి 1100 మందిని గుర్తించాల్సి ఉండగా ఒక అశ్వారావుపేట మండలానికి 300 కేటాయించడం జరిగింది. ఒక్క అశ్వారావుపేట మండలంలోని 820 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 300 మందినీ ఫైనల్ చేసుకునేటట్లుగా నాయకుల మధ్య, ప్రజా ప్రతినిధుల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో అశ్వరావుపేట, పేరాయి గూడెం,గుర్రాళ్ళ చెరువు పంచాయతీకి 200 మందికి ఇచ్చే విధంగా మండలంలోని మిగిలి పంచాయతీలలో 100 మందికి అసలైన లబ్ధిదారులను గుర్తించి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఎన్నికలు సమీపిస్తున్నాయని అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను అప్రమత్తం చేసిన క్రమంలో ప్రధాన నాయకులు కొందరు ఆ హడావుడిలో ఉన్న సందర్భంలో మాజీ ఎమ్మెల్యే మంచితనాన్ని అలుసుగా తీసుకొని అశ్వారావుపేటకు చెందిన ముగ్గురు నలుగురు బారాస నాయకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి కలిసి కూర్చుని మాట్లాడిన నేతలకు గానీ ప్రజాప్రతినిధులకు గాని ఈ విషయాన్ని తెలియనియకుండ లబ్ధిదారుల లిస్టును ఆన్లైన్ చేసే ప్రక్రియ కొనసాగించారు. అనుకోకుండా ఆ ప్రదేశానికి వెళ్లిన భారసా నాయకులు ఈ పైరవీ కారులను చూసి అవాక్కయి మాకు తెలియకుండా మీరు ఎవరు ఈ విధంగా చేయడానికి అని వాగ్వాదం జరిగిన పిమ్మట ఆ లిస్టు ని పక్కన పెట్టారు. ఇక్కడ అసలు విషయం బయటపడింది.

Also Read : మిజోరం సీఎం గా లాల్దుహోమా 8న ప్ర‌మాణ‌స్వీకారం

ఈ 300 మంది లబ్ధిదారులను వీళ్ళు ఫైనల్ చేయడంతో వీరు వద్ద నుండి పైకం తీసుకున్నారని అపవాదు ఆ రోజు నుండి మొదలై అదేంటో తేలే వరకు తాత్కాలికంగా ఆపివేశారు.ఈ విషయం తెలియని ఆశావాహులు ఎన్నికలు అయ్యే వరకు ఎదురు చూశారు. వీరిలో ఓ కొబ్బరి బొండాలు వీధి వ్యాపారి, సెల్ షాప్ లో పనిచేసే గుమ్మస్తా, వస్త్రాలు అమ్ముకునే చిరు వ్యాపారి ఇలా పలువురు ఉన్నట్లు తెలుస్తుంది.ఎన్నికల ఫలితాలు అనంతరం ఇప్పుడు లబో దిబో అనుకుంటూ నాయకులు చుట్టూ తిరుగుతున్నారు. వారికి జరిగిన అన్యాయంపై అవసరమైతే జిల్లా కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా బారాస అభిమాని ఒకరు మాట్లాడుతూ ఈ 300 మంది లబ్ధిదారుల దగ్గర కూడా ఈ పైరవీ కారులు వసూళ్లపర్వం జరిపే ఉంటారని వారి వద్ద నుండి ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయలు తీసుకున్న మూడు కోట్ల పైనే ఈ స్కాం ఉన్న ఆశ్చర్యం లేదని అనడం కొసమెరుపు. చూడాలి ఈ విషయం ఎంత దాక వెళుతుందో..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube