ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానానికి చేరిన ఎలాన్‌ మస్క్‌

ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానానికి చేరిన ఎలాన్‌ మస్క్‌

0
TMedia (Telugu News) :

ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానానికి చేరిన ఎలాన్‌ మస్క్‌

టీ మీడియా, ఫిబ్రవరి 28, న్యూఢిల్లీ : ప్రపంచ కుబేరుల జాబితాలో తిరిగి తొలిస్థానానికి చేరుకున్నారు అపర కుబేరుడు, టెస్లా అధినేత, ట్విట్టర్‌ కొత్త బాస్‌ ఎలాన్‌ మస్క్. గత ఏడాది అధిక నష్టాల కారణంగా మస్క్ ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. టెస్లా షేర్లు రాణించడంతో ఆయన మళ్లీ తొలిస్థానానికి చేరుకున్నారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. గత ఏడాది డిసెంబరులో ఎలాన్‌ మస్క్‌ సంపద 200 బలియన్‌ డాలర్ల మేర కరిగిపోయింది. టెస్లా షేర్లు పతనమవడంతో ఆయన తన తొలిస్థానాన్ని కోల్పోయారు. ఇక ప్రస్తుతం టెస్లా షేర్లు బలంగా పుంజుకోవడంతో తొలిస్థానాన్ని కోల్పోయిన రెండు నెలల్లోనే మళ్లీ తన స్థానాన్ని సొంతం చేసుకున్నారు మస్క్‌. టెస్లా షేర్లు ఈ ఏడాదిలో ఇప్పటి వరకు70శాతం మేర పెరిగాయి. ఫలితంగా ఏడాది మొదట్లో 137 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎలాన్‌ మస్క్‌ సంపద.. ఇప్పుడు ఏకంగా 187 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్‌ తన కథనంలో నివేదించింది. ఇక ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో మస్క్‌ తర్వాత బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ 185 బిలియన్‌ డాలర్ల సంపదతో రెండో స్థానంలో ఉన్నారు.

Also Read : సాగర్ నీరు సమృద్ధిగా ఇవ్వాలి

అమెజాన్​బాస్​ జెఫ్​ బెజోజ్ మూడో స్థానంలో ఉండగా.. ఒరాకిల్‌ కో-ఫౌండర్‌ లారి ఎల్లిసన్‌ నాలుగో స్థానం దక్కించుకున్నారు. వారెన్ బఫెట్ 106 బిలియన్​ డాలర్ల సంపదతో 5వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇండియా నుంచి.. రిలయన్స్​ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్​అంబానీ 84.3 బిలియన్​ డాలర్ల సంపదతో 8వ స్థానంలో ఉన్నారు. ఇక గౌతమ్‌ ఆదానీ 37.7 బిలియన్‌ డాలర్ల సంపదతో 32వ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ తన నివేదికలో పేర్కొంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube