అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం

అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం

1
TMedia (Telugu News) :

అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాసం

టీ మీడియా, డిసెంబర్ 2, వనపర్తి బ్యూరో : పెబ్బేరు మండలం పరిధిలో కొత్త సూగూరు గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ ఆధ్వర్యంలో విహెచ్ఎన్డి కార్యక్రమం నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు.అనంతరం గ్రామ సర్పంచ్ జూదం వెంకటేష్ మాట్లాడుతూ గర్భిణీలు చిన్నారులకు అందిస్తున్న పౌష్టిక ఆహారం ప్రతి ఒక్కరు అంగన్వాడి కేంద్రంలో తినాలి గ్రామంలో ఎవరికైనా పౌష్టికాహారం అందని ఎడల మా దృష్టికి తీసుకురాగలరు. చిన్నపిల్లలు అంగవైకల్యానికి గురి కాకూడదని లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ప్రతి గ్రామానికి పౌష్టికాహారం సరఫరా చేస్తుంది.

Also Read : పాలాభిషేకం చేసిన గౌడ సంఘం నేతలు

కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యాదగిరి, ఏఎన్ఎం అనురాధ, అంగన్వాడి టీచర్ స్వరూప, రాణి, మంజుల, ఆశ వర్కర్లు నాగమణి, భారతి, పిల్లల తల్లిదండ్రులు విజయలక్ష్మి, మనీషా, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube